అర్రు కడిగిన ఎద్దు” స్వగతాన్ని కళ్ళకు కట్టిన గోపీచంద్.! .

అర్రు కడిగిన ఎద్దు” స్వగతాన్ని కళ్ళకు కట్టిన గోపీచంద్.!

.

“నేను ఇప్పుడీ కొట్టంలో వొకమూల పడి వున్నాను.

నేను ఇక్కడ ఈసురోమని పడివున్నాననే సంగతి యెవ్వ రూ గమనించరు. నాచుట్టూ వున్న ఈ రొచ్చూ, నా శరీరం మీదవున్న ఈ గోమార్లూ చూశారా? అంతే – చుట్టూ కొంచెం బాగు చెయ్యాలని గానీ, చచ్చేదాకా నా వొళ్ళు వీలున్నప్పుడల్లా శుభ్రపరచి నా చావు సుఖవంతం చెయ్యాలని గానీ ఎవ్వరికీ పట్టదు” అని బాధపడుతుంది.

.

వయసుమళ్లినా ఇంకా చావకుండా బ్రతికే ఉన్నందుకు యజమాని మొదలు ఇంటిల్లిపాదీ విసుక్కుంటుంటే “నాకు త్వరగా చచ్చిపోవాలనే ఉంది. ఏం చెయ్యనూ? నాకు చావు రాకుండా వుంది” అంటూ తన ఆక్రోశాన్ని వెల్లగ్రక్కు తుంది. 

ఇప్పుడిలా ఉంది కానీ “రాత్రింబవళ్ళు కష్టపడి పని చేయగలగిన స్థితిలో వున్న ఆ రోజుల్లో తన బిడ్డలకంటే మమ్ములను ఎంతో జాగ్రత్తగా చూచుకునే వాడు మా యజమాని. నన్నూ నా జత ఎద్దును కొన్నప్పుడు ఆయన పది ఎకరాల రైతు. మా అర్రులు కడిగే నాటికి ఇరవై ఎకరాల రైతు. ఈ పది ఎకరాలూ ఆయన మావల్లే కొనగలిగాడని నేను చెప్పుకుంటే మాత్రం యీనాడు నామాట నమ్మేది ఎవ్వరు?” కానీ, ఆ మాటను ఆ ఇంట్లో ఎవరు అనుకుంటారు? ఎవ్వరూ అనుకోరు… ఆ యింట్లో కుక్కి మంచంలో కూచుని ఉన్న యజమాని తండ్రి తప్ప.

.

“ఉపయోగపడినన్నాళ్లూ ఉపయోగించుకొని,తరువాత కాటికి కాలు పట్టుకొని యీడ్చే రోజులు ఇవి. కొడుకు కన్న తండ్రిని, తల్లినే యీ పనిచేస్తున్నాడు. ఇక మాదేముంది – నోరులేని మూగజీవాలం” అని బాధపడుతూ అదిగో… ముసలాయన్ని కాకి లా పొడవడానికి కోడలు వస్తోంది. ఎద్దు కండను పొడవడానికి కాకి రెక్కలు ఆడిస్తోంది. అబ్బా…. కథ ముగుస్తుంది. కాకి పోటు మన హృదయంలో దిగుతుంది. కాబట్టి మనం కాకిని హుష్ అని తరిమికొట్టాలి. ముసలి తండ్రి చేతిలోని ఊతం అవతల పారేసి మన భుజాన్నే ఆసరా గా యివ్వాలి. ఈ పండగ కాలంలో అయినా మన పెద్దల వొడిలో కొత్త బట్టలు పెట్టి కృతజ్ఞతగా వాళ్ల పాదాలకు నమస్కారం చేయాలి. చేస్తే మనుషులం. చేయకపోతే?


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!