ప్సామవేదం – శ్రీశ్రీ – అనువాద కవిత!

ప్సామవేదం – శ్రీశ్రీ – అనువాద కవిత!

( శ్రీశ్రీ గారు 1943లో వ్రాసినపటికీ ముద్రణ మాత్రం షుమారు 10-11 సంవత్సరముల తరువాత అంటే, నవంబరు 13, 1953న భారత దేశ స్వాతంత్ర్యం వొచ్చిన తరువాత, తెలుగు స్వతంత్రం అనే వార పత్రికలో ముద్రితమై వెలుగు చూసింది. )

.

ప్సామవేదం

కవిత 1:

పాడకోయ్ కవీ! కాంగ్రెస్ ఒక

భజన సమాజం మాత్రమే అనీ!

ప్రతినిధులంతా నిద్రపోయినా

భవనం కిక్కిరిసిన సత్రమే సుమీ!

కవిత 2:

కాంగ్రెస్ నిత్యం, కాంగ్రెస్ సత్యం!

స్వపరిపాలనం కాంగ్రెస్ గమ్యం!

ఆత్మ అనే దీపం వెలిగేందుకు

ఆదర్శమనే తైలం ముఖ్యం!

కవిత 3:

కాంగ్రెస్ యుద్ధం-రూల్స్ ప్రకారం

కాగిలాలతో! నామకార్థకం!

అడపా దడపా అంతః కలహం!

అయితే బిల్ కుల్ అహింసాత్మకం!

కవిత 4:

మితవాదులు నేర్పే గుణపాఠం

ఏయే యెండల కా యా గొడుగులు!

కాదని బరిదిగి తిరగ బడేవో

ద్వీపాంతరమే! లేదిక తిరుగుడు!

కవిత 5:

కావున జోరుగ కంఠశోషగా

ఉపన్యసిస్తూ నుంచుందాం!

అస్తమానమూ లాభం చూడక

రాజ భక్తితో పొంచుందాం!

ఈ కవితకు ప్రతిపదార్థం, తాత్పర్యం అవసరం లేదు అను కుంటాను. ఐతే లఘు వ్యాఖ్య తప్పనిసరిగా అవసరము. ఈ కవితల్లో ముఖ్యంగా కవి అలనాటి కాంగ్రెస్ శాఖ యొక్క పనితీరును ఎండగట్టే ప్రయత్నం చేసారు.

మొదటి కవితలో, ఓ కవీ అనవసరంగా గొంతు చించుకోకు, కాంగ్రెస్ అంటేనే ఒక భజన సంఘం అది అందులో భజన పరులకే స్థానమని ఆ సభలు అట్టి వారితో కిక్కిరిసి ఉన్నాయి అని వాపోయారు.

రెండవ కవితలో, ఉన్నత భావాలు నామమాత్రమేనని, ఆచరణ శూన్యమని, ఆత్మా అనే దీపాన్ని వెలిగించాలి అంటే మంచి ఆదర్శాలతో కూడిన తైలం ఉండాలి అని ఉద్భోధ చేసారు.

మూడవ కవితలో, కాంగ్రెస్ సభలలో అడపాదడపా అహింసాత్మక కలహాలని జెప్పు కొచ్చారు. ఈ కాలంలో చట్ట సభలలో అహింసాత్మక ధోరణి కొంచెం కష్టమే అని వేరే చప్పలా?

నాల్గవ కవితలో, మితవాదులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారని, వారికి ఒక అభిప్రాయం ఏమీ ఉండదని, గోడ మీద పిల్లి వాటం అని వ్యగ్యంగా చురకలు వేసారు. ఇక అతివాదులు మితిమీరి తిరగ బడితే, వారికి ద్వీపాంతర వాసము (అండమాన్ నికోబార్ జైలు) ఖాయం అని చెప్పారు. వాస్తవానికి ఇప్పటి పరీస్థితి దీనికే ఏమాత్రం భిన్నంగా లేదు అని మనకు తేట తెల్లం అవుతింది.

ఇక చివరగా, ఐదవ కవితలో, గొంతు అలసి సొలసి పోయేవరకు ఎంచక్కా ఉపన్యాసాలు దంచి కోడదాము, స్వలాభం కొంత విడచి, ఉన్నతమైన దేశభక్తితో మన రాజ్యాని దేశాన్ని కనిపెట్టుకొని ఉందాము. అని ముగించారు.

.

(నెట్ నుండి) .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!