తేటివలపు (దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత.) .

తేటివలపు (దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత.)

.

చిరుపాట సెలయేటి కెరటాల

బడిపోవు విరికన్నె వలపువోలె 

తీయని మల్లెపూదేనె సోనల పైని

తూగాడు తలిరాకు దోనెవోలె

తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై

పరువెత్తు కోయిల పాటవోలె

వెల్లువలై పారు వెలది వెన్నెలలోన

మునిగిపోయిన మబ్బుతునుకవోలె

.

చిరుత తొలకరివానగా చిన్ని సొనగ

పొంగి పొరలెడు కాల్వగా నింగి కెగయు

కడలిగా పిల్లగ్రోవిని వెడలు వింత

తీయదనముల లీనమైపోయె నెడద.!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !