~ మే 15,2013, బుధవారం, వైశాఖ శుద్ధ పంచమి, జగద్గురువులు శ్రీ శంకరాచర్యులవారి జయంతి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~ హిందూ/భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు. ~ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సరిగ్గా 2522 సంవత్సరాల క్రితం, 509 BC లో వైశాఖ శుద్ధ పంచమి రోజున దక్షిణ భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలో కాలిడి గ్రామంలో శివ గురువు, ఆర్యాంబ దంపతులకు బిడ్డగా, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ధర్మ పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుడి అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యలు అవతరించారు. ~ చిన్న వయసులోనే వేదాలను, Philosophy, Metaphysics, Theology మొదలైన ఇతర శాస్త్రాలను చదివేశారు. 8 ఏళ్ళ వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు. ~ తన వాదన ప్రతిభతో బౌద్ధ,...