ముక్కు తిమ్మన్న గారి పద్యములు...
ముక్కు తిమ్మన్న గారి పద్యములు.....
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్
తొలగన్ ద్రోచె లతాంగి ! యట్ల యగు నాధుల్ నేరముల్ సేయ పే
రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే !!
కోపన పద హతి కుహనా
గోపాలుడు కాంచి మెయి గగుర్పొడవగ ను
ద్దీపిత మన్మధ రాజ్య
ప్రాపితుడై పలికె కూర్మి బయట పడంగన్ !
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్క బూని తా
చిన యది నాకు మన్ననయ ! చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
నని యెద నల్క మానవు గదా యికనైన నరాళ కుంతలా !!
Comments
Post a Comment