గోస్వామి తులసీదాసు

కాశీనగరంలో
గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసెడివారట. ప్రతిదినము కాలకృత్యములకొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదాట్లో పోసెడివారు. ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై "ఏమైనా అడుగు ఇస్తాను" అంది..మహాభక్తుడు తులసీదాసు శ్రీరామ దర్శనం కోరారు...ఆపని తనవల్లకాదంది కాని ఉపాయం చెప్పిందాభూతం...నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. ..అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు..కన్నులనీరు కారుతూవుండగా ఆనందంగా రామాయణం వింటూ వుంటాడు...అతన్ని పట్టుకో...అంది భూతం..శ్రీరాముడు కావాలంటే హనుమను పట్టాలి..హనుమను పట్టాలంటే భక్తితో శ్రీరామగానం చేయాలి...హనుమ సాయంతో శ్రీరామదర్శనమైంది గోస్వామికి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!