తులసి దివ్యౌషధము.


హిందువులకు తులసి పవిత్రమైనది. ఇది దేవతా ప్రీతికరము. పూజాద్రవ్యములలో ఒకటి. దీనిచేత ఇతర దేవతలను పూజిస్తారు. ఇది
దివ్యౌషధము. శ్రీకృష్ణ భగవానుడు తరుచు తులసి వనమునందు విహరించుచుండెడివాడు. దీనియొక్క గాలి స్పర్శవలన దీర్ఘాయుర్దాయము కలుగుతుంది. ఎవరింట్లో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్ధ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు.సర్వ పాప సంహారకమైన ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు.అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం - ఈ మూడూ సమాన ఫలదాయకాలే. తులసిని ప్రతిష్టించినా, నీళ్ళు పోసినా, తాకినా సర్వ పాపాలూ నశిస్తాయి.
By Padmini Bhavaraju

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!