కృష్ణ శాస్త్రి గారి పైన ప్రముఖుల అభిప్రాయాలు.

.

కృష్ణ శాస్త్రి గారి పైన ప్రముఖుల అభిప్రాయాలు.

చలం గారు---తన బాధంతా అంతా ప్రపంచపు బాధ అనుకుంటాడు కృష్ణశాస్త్రి,ప్రపంచపు బాధంతా తన బాధ అనుకుంటాడు శ్రీ శ్రీ .

మహాకవి శ్రీశ్రీ --- నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.

కృష్ణ శాస్త్రి గారు చనిపోయిన రోజున శ్రీ శ్రీ గారు యిలా అన్నారు---తెలుగుదేశపు నిలువటద్దం బద్దలైంది.షెల్లీ మళ్ళీ మరణించాడు.

కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు--- మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.

వారి రచనల్లో కొన్ని.

కృష్ణపక్షము, ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి, అమృతవీణ,శర్మిష్ఠ,మహతి లాంటి పెక్కు ప్రసిద్ధ కావ్యాలను వ్రాశారు.

ఈ మధుర కవికి నీరాజనాలు సమర్పించుకుందాం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!