ద్వారకా నగరం....


ద్వారకా నగరం....
మహాభారతం లో ద్వారకా నగరం ద్వారావతి గా పిలువబడింది. ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండడమే ఇందుకు కారణం. సంస్కృత భాషలో ద్వారం అంటే తెలుగులో వాకిలి లేక ద్వారం అని అర్ధం. కనుక రెండు కారణ నామాలు ఈ నగరానికి చక్కగా వర్తిస్తాయి. అనార్తా సామ్రాజ్యాధీశులైన యాదవులకు ద్వారక రాజధాని. గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉన్న ఈ నగరం సముద్రజలాల వలన ముంచివేయబడింది. ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడడానికి శూర సామ్రాజ్యానికి చెందిన యదు ప్రముఖులు సముద్ర గర్భంలో ఉన్న ద్వీపాల సమూహాలను ఎంచుకుని, ఈ నగర నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి, పూర్తి చేసి, ప్రజలను శూరసేన సామ్రాజ్యపు రాజధాని మధుర నుండి ద్వారకకు తరలించారు. ఈ ప్రదేశం అనర్త సామ్రాజ్యంలో ఒకభాగం. ద్వారకా నగరాన్ని సామ్రాజ్యము అనే కంటే సంయుక్త రాజ్యసమాహారం అనటం సమంజసం. అంధకులు, వృష్టులు, భోజులు ఈ రాజ్యసమాహారం లోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దశరాస్ మరియు మధవులు అని కూడా పిలువబడ్డారు. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యులు వాసుదేవ కృష్ణుడు మరియు బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు మరియు ఉగ్రసేనుడు.
కుశస్థలి అనబడే ద్వారకా నగరం వాసుదేవ కృష్ణుడి చేత జరాసంధుడి యుద్ధాల నుండి ప్రజలను కాపాడే నిమిత్తం నిర్మించబడింది. యాదవులు మధుర నుండి ద్వారకకు సురక్షితంగా తరలించబడ్డారు. పశ్చిమ తీరానికి తరలి వచ్చిన ఈ యాదవ నిర్మిత ఆనందమయ నగరం కుశస్థలి అని పిలువబడింది. ఈ నగర సమీపంలో రైవతక పర్వతాలు ఉన్నాయి. యాదవులు ఇక్కడకు తరలి వచ్చిన తరువాత ఈ నగర కోటను తిరిగి పటిష్టంగా నిర్మించి, శత్రు దుర్భేద్యం చేసారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!