శ్రీకాళహస్తీశ్వర శతకము ..దుర్జటీ

అంతా సందయమే శరీర ఘటనం / బంతా విదారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమే మే / నంతా భయభ్రాంతమే
యంతానంత శరీరశోషణమే దు / ర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్నుదలంచి పొందురు నరుల్ / శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీకాళహస్తీశ్వర శతకము ..దుర్జటీ

శ్రీ కాళహస్తీశ్వరా! పరీక్షించి చూడగా శరీరంతయును భయ భ్రాంతులచేత కూడినట్టిదే.విచారించి చూడగా జరుగుతున్నదంతా శరీరమును శుధ్కింపచేసే విషయాలే.లోపల ఉన్న జీవుడు ఒక దుఃఖంలోకి పడినట్లుగా ఒక జన్మ నుంచి ఇంకొక జ్న్మానికి చేసే ప్రయాణమే.ఈ ప్రపంచమంతా సందేహాలమయమే.అయినా ఈ మనుష్యులు తమ మనస్సులలో నిన్ను గురించి అలోచించి నిన్ను చేరుకొనే ప్రయత్నం చేయటంలేదు

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!