ఇది నా 100వ పోస్టింగ్ప. ఇది మా తాతగారు వింజమూరి జోగయ్య గారికి అంకితం. ఈ పద్యం వారికీ ఎంతో ఇష్ట వారు,
ఇది నా 100వ పోస్టింగ్ప. ఇది మా తాతగారు వింజమూరి జోగయ్య గారికి అంకితం. ఈ పద్యం వారికీ ఎంతో ఇష్టము అని మా తండ్రి గారు వింజమూరి వెంకట్రావు గారు చెప్పే వారు,
ప విపుష్పంబగు, నగ్నిమంచగు,నకూ / పారంబు భూమీస్థలం
బవు,శత్రుండతిమిత్రుడౌ,విధముది / వ్యాహారమౌనెన్నగా
నవనీమండలి లోపలున్ శివ శివే / త్యా భాషణోల్లాసికిన్
శివ!నీ నామము సర్వవశ్యకరమౌ / శ్రీకాళహస్తీశ్వరా!
శ్రీకాళహస్తీశ్వర శతకము ధూర్జటీ.
శ్రీకాళహస్తీశ్వరా!ఈ భూమియందు నీమహిమగల నామమైన "శివ శివ"యని నామోచ్చారణము చేయువానికి కఠినమైన వజ్రము సుకుమారమైన పువ్వుగాను,అగ్నిమంచుగాను,సముద్రము భూమిగాను,శత్రువు మిత్రుడుగాను, విషము గొప్పరుచికరమైన ఆహారముగాను కన్పట్టు చుండును.పరికించగా నీ పేరు అన్నింటిని వశము చేసుకోనునట్టిది అని తెలియును.

OM NAMAH SIVAYA
ReplyDelete