.శ్రీకాళహస్తీశ్వర శతకము.
కలంచు న్మకునంబులంచు గహయో / గంబంచు సాముద్రికం
బులటంచుం దెవలంచు,దిష్టియనుచు / న్భూతంబులంచు న్విషా
శలటంచు న్నిమిషార్ధ జీవనములం / దుం బ్రీతి పుట్టించినా
సిలుగుల్ ప్రాణూల కెన్ని చేసితివయ్యా! / శ్రీకాళహస్తీశ్వరా!
ధూర్జటీ....
.శ్రీకాళహస్తీశ్వర శతకము.
శ్రీకాళహస్తీశ్వరా!ప్రకృతియందు మానవ జీవితములో కలలనీ, శకునాలనీ, గ్రహచారమనీ, సాముద్రికమనీ, రోగాలనీ, దిష్టియనీ, భూతములనీ,విషాదములనీ-ఎన్నియో రీతులను కల్పించితివి గదయ్యా!ఇవన్నియు క్షణాభంగురమైన.మానవ జీవితానికి అంగరక్షలు అని ఏర్పరచితివి.నీ భక్తి ఉన్నచో ఇవి అన్నియు ఏమీ చేయలేవు గదా!
Comments
Post a Comment