ఆ బాలుడే పోతనామాత్యులు.
"ఇవ్విది దివీటీల్ వెలుగు యేమని బాలుడు పృచ్ఛ చేయగ...పలికె లక్కమాంబ"... అంటూ భాగవతం రాయడానికి ఆ పోతనామాత్యులను పురిగొల్పిన సంఘటనను చక్కగా వివరించారు ఈ పద్యంలో. "అమ్మా ఈ కాగడాల వెలుగేమిట"ని ఓ కు్రాడు ప్రశ్నించగా.. అతని తల్లి లక్కమాంబ "భాగవతం ప్రదర్శన ఉంది నాయనా.. దానికి సూచనగా ఇలా దివదిటీలు పెట్టారు" అనిచెప్పడం.. ఆ తర్వాత ఆ బాలుడు భాగవతమంటే కేవలం సంస్కృతంలో ఉంటుందని, సామాన్యులకు అది ఏమాత్రం అర్థంకాదని తెలుసుకోవడం.. "నేన్ రాసెదన్" అంటూ తల్లికి బాస చేసి, తెలుగులో భాగవతాన్ని రాస్తానని పదేళ్ల ప్రాయంలో చెప్పడం నిజంగా దైవ సంకల్పమే. ఆ బాలుడే పోతనామాత్యులు.
అచ్చతెలుగులో మనకు భాగవత గాథల్ని అందించారు. పలుకు పలుకునా తేనెలొలికే అచ్చతెలుగు భాషలో పద్యాలను కూర్చి... మనల్ని ధన్యుల్ని చేశారు. అసలు ఆయన శైలిని వర్ణించలేము. భాగవతంలో తొలిపద్యమే.. "పలికెడిది భాగవతమట.. పలికించెడువాడు రామభద్రుండట.. నేపలికెద ..." అంటూ.. ద్రాక్షాపాక శైలిలో మనకు అందించారు.
"సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగముల్ చేదోయి సంధించడు.." కూడా ఆయన భాగవతంలోనిదే..
Sahakaram ..Kamalapathi Rao Hindupuram
Sir, Talli Ninnu talanchi ne pustakambun........
ReplyDeletepadyam ni post cheyagalaru
అప్పారావు గారూ!!
ReplyDeleteపోతన భాగవతంలోని మొదటిపద్యం "పలికెడిది భాగవతమని"అనేది కాదండీ!!
"శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్,
లోక రక్షైకా రంభకు భక్త పాలన కళాస0రంభకున్
దానవోద్రేక స్తంభకు,కేళిలోల విలసదృగ్జాల సంభూతనా
నాకంజాత భవాండకుంభకు మహా నందాంగనా డింభకున్"
అనేదండీ!!
అప్పారావు గారూ!!
ReplyDeleteపోతన భాగవతంలోని మొదటిపద్యం "పలికెడిది భాగవతమని"అనేది కాదండీ!!
"శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్,
లోక రక్షైకా రంభకు భక్త పాలన కళాస0రంభకున్
దానవోద్రేక స్తంభకు,కేళిలోల విలసదృగ్జాల సంభూతనా
నాకంజాత భవాండకుంభకు మహా నందాంగనా డింభకున్"
అనేదండీ!!
Thank you for the post. Could you please post the complete padyam of this one:
ReplyDelete"ఇవ్విది దివీటీల్ వెలుగు యేమని బాలుడు పృచ్ఛ చేయగ..."