దేవకీదేవి కడుపు శోకం ....

దేవకీదేవి కడుపు శోకం ....      పోతనామాత్యుడు...



ఉ.“అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ
మన్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో
వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్.



క.కట్టా; యార్గురు కొడుకులఁ
బట్టి వధించితివి; యాఁడుఁబడుచిది; కోడల్;
నెట్టన చంపఁగ వలెనే?
కట్టిఁడివి గదన్న! యన్న! కరుణింపఁ గదే.

క.పుత్రుడు నీ బ్రతుకునకును
   శత్రుండని వింటిగాన సమయింపఁ దగున్;
   పుత్రులకు నోమ నైతిని
   పుత్రీ దానంబు జేసి పుణ్యముఁ గనవే.











Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!