"శ్రీకాళహస్తి మాహాత్మ్యము" లో మదిరాపానంతో మత్తెక్కిన శబరదంపతుల చేష్టల వర్ణన



-

"శ్రీకాళహస్తి మాహాత్మ్యము" లో మదిరాపానంతో మత్తెక్కిన శబరదంపతుల చేష్టల వర్ణన

.

మాటలాడఁ దలంచి మఱచిపోయెడివారు,

నడవఁబోవుచుఁ దొట్రుపడెడువారు,

యూరకుండెదమని యుండనోపనివారు,

లేచెదమని లేవలేనివారు,

పనిలేనిపని బట్టబయలు దిట్టెడివారు,

పాడనేరకయును పాడువారు,

యెదురైనవారికి నెల్ల మ్రొక్కెడివారు,

వ్రీడావిహీనులై యాడువారు,

చాలఁ ద్రావియు మగుడఁ జేసాచువారు,

దొడరి యుపదంశ భాండముల్దొడుకువారు

నైరి, మృగయాధిదేవత దైవతయాత్రయందుఁ

పానములు చేసి శబరదంపతులు రతుల !

(శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి)

.విశ్లేషణ..Satyanarayana Piska

మృగయాధిదేవత దైవతయాత్రలో సురాపాన గారు.ము చేసిన శబరదంపతుల చేష్టలను అతి సహజంగా వర్ణించినాడు ధూర్జటి కవీంద్రుడు.... వారు ఏదో మాటాడవలెనని తలచి, అది మరిచిపోతున్నారు. నడవబోయి తూలిపడుతున్నారు. నిశ్శబ్దంగా ఉండాలనుకొని కూడా ఉండలేకపోతున్నారు. లేవాలని ప్రయత్నించి కూడా, లేవలేకపోతున్నారు. పనిలేకపోయినా ఊరికే ఇతరులను తిడుతున్నారు. పాడటం చేతకాకపోయినా, రాగాలు తీస్తున్నారు. ఎదురుపడినవారందరికి నమస్కరిస్తున్నారు. సిగ్గువిడిచి గంతులు వేస్తున్నారు. నిండుగా త్రాగికూడా మళ్ళీ చేయి చాపుతున్నారు. నంజుడుకుండలను ఒడిసి పట్టుకుంటున్నారు...

ధూర్జటికి రూపక, ఉత్పేక్షలు ఎంత సులభములో, స్వభావోక్తి కూడా అంతే సులభం. పై వర్ణన త్రాగినవారి చేష్టలను ఎంతో సహజంగా కళ్ళకు కట్టిస్తోంది కదూ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!