శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

 
 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

              సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

              రామనామ వరానన ఓం నమ ఇతి 


కల్మషమైన చిత్తము, పాపిష్టి సంపాదనతో జీవించడం, ఆచరించవలసిన కర్మలను నిర్వర్తించకపోవడంతో పాటు నిషిద్ధ కర్మలకు పాల్పడడం మనుష్యులకు దుఃఖాన్నిస్తాయి. 


అయితే తరుణోపాయం ఉంది. భక్తిరేవ గరీయసీ! భక్తి ఒక్కటే మార్గం. అందుకే శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు "పిబరే రామరసం ... - ఓ జిహ్వా, రామరస పానం చేయవే" అని ఉపదేశించారు. 


భగవన్నామ సంకీర్తన అన్నప్పుడు శ్రీ రామనామమే ఎందుకు జ్ఞాపకం వస్తుంది? 


శ్రీరామ శబ్దం జగత్తులొనే మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని కాళిదాసు మహాకవి అన్నాడు. ఔషధం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమృతం అమరజీవనం ఇస్తుంది. శ్రీరామనామామృత పానంతో అమరత్వం సిద్ధిస్తుంది. అసలు శ్రీరామతత్త్వం మన మనసులోనే ఉంది. 


అష్టాక్షరి (ఓం నమోనారాయణాయ) లో "రా" శబ్దము, పంచాక్షరి (ఓం నమశ్శివాయ) లో "మ" శబ్దం తీసుకోగా రామశబ్దం ఏర్పడింది. రేడు మంత్రాలలొని శక్తిని కలుపుకున్న శక్తి రామనామానికి ఉంది. అంతేకాదు, శ్రీరామనామం త్రిమూర్త్యాత్మకమైనది. రామశబ్దం అద్వైతపరంగా కూడా పరబ్రహ్మతత్త్వాన్నే సూచిస్తుంది.


శ్రీరాముని రామాయణానికి పరిమితం చేసి దశరథుని కుమారునిగా, సీతాపతిగా చూసినా ఆ పురుషోత్తముడు శాంతిస్వరూపుడు. శ్రీరాముని వైరాగ్య దృష్టి అసమానము. ఆయన ప్రేమస్వరూపుడు. రామాయణ కావ్యంలోని తాత్త్విక రహస్యాలకు అంతులేదు. ఆ కావ్యంలో చెప్పినదంతా ప్రతి జీవి కథ. ప్రతి పాత్ర ద్వారా, ప్రతి కాండ ద్వారా మానవజాతికి మహత్తర సందేశం అందుతున్నది. 


కల్మష నాశనం చేసే రామనామం జననమరణాల వాళ్ళ జనించే వివిధ భయాలను, శోకాలను హరించి వేస్తుంది. సకల వేదాలు, ఆగమాలు, శాస్త్రాలకు సారభూతమైనది శ్రీరామనామము. రామాయణంలో ఏ సన్నివేశం చూసినా సకల శాస్త్ర నిగమ సారమే కనిపిస్తుంది. 


జగత్పాలకమైనది రామనామం. రామనామంతో పునీతమైతే అపవిత్రమైనదన్తో ఏదీ ఉండదు. అటువంటి రామనామామృతాన్ని పాణం చేయడానికి కుల, జాతి, మత వ్యవస్థలు ఏవీ అవరోధాలు కావు. 


కావలసినది భక్తి. రావలసినది ఆర్తి. 


మనం తరించాలి. ఇతరులను తరింపజేయాలి.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!