మాతా అన్నపూర్ణమ్మ అవస్థ...

మాతా అన్నపూర్ణమ్మ అవస్థ...

శ్రీ కొర్నెపాటి శేషగిరిరావు పంతులు గారి రచనలలో కల్పనాచాతుర్యము

....................................................................................................

సీ.రెండు నోళుల బిడ్డడుండ్రములోయని నెత్తిన నోరూని మొత్తుకొనగ 

నాల్గు నోళుల మామ నాకు నోరెమటంచు నాకటి పెల్లున నటమటింప

ఐదు నోళుల భర్త 'అన్నమో రామచంద్రా' యని యల్లాడి యాకుమేయ

ఆరు నోళులబిడ్డడా యొంటి చంటికై గొల్లున పాలని గోలసేయ

కాపురంబది పెను వల్లకాడుగాగ

అట్టి కాపురమెట్టులో మట్టు వెట్టు

గట్టు రాపట్టి పట్టెడు పొట్ట కూటి

కన్నపూర్ణామహాదేవినాశ్రయింతు!!!

విన్నారా! ఈ పద్యంలో ఓ సాధారణ గృహిణి తన సంసారాన్ని ఏ పొరపొచ్చాలు లేకుండా నెట్టుకురావడానికి ఎలా తంటాలు పడుతుందో? ఇది సాధారణ గృహిణీవిషయ వర్ణన ప్రధానం కాదు. అన్నపూర్ణా మహాదేవిని వర్ణించడం ప్రధానాంశం. ఆ వర్ణనలో దేవతాప్రకృతిలో కూడా మానవప్రకృతిని ప్రతిబింబింప జేయడం- ఇక్కడ కవిగావించిన గొప్ప కల్పనాచాతుర్యము. అందుకు ఈ పద్యములోని “నెత్తిన నోరూని మొత్తుకొనగ, అటమటింప, ఆకు మేయ,ఒంటిచంటికై” ఇత్యాది తెలుగు పలుకుబడులూ, “రెండు నోళుల బిడ్డడు,నాల్గు నోళుల మామ, మొదలుగాగల తెలుగు పదబంధాలు- ఆ అక్షర సంసార భారాన్ని వ్యక్తీకరిస్తున్నాయి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!