సూర్యాస్తమయ వర్ణన :(శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి) .

ధూర్జటికవీంద్రుని అసమాన ఊహాసౌందర్యానికి అద్దంపడుతున్న పద్యం.

.

సూర్యాస్తమయ వర్ణన :(శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి)

.

ప్రాగ్వధూమణి చిమ్మఁ బశ్చిమదిక్కాంత

పట్టిన చెంగల్వబంతి యనగ,

కాలవిష్ణుం డంధకారదైత్యుని వ్రేయఁ

చరమాద్రి బడిపోవు చక్ర మనగ,

దినమహీరుహమునఁ దేజోమయంబుగా

పండి రాలిన పెద్దపండనంగ,

దివినుండి దేవదానవ యుద్ధ రక్తార్ద్ర

మై నేలఁగూలు రథాంగ మనగ,

పద్మినీసంగమశ్రాంతిఁ బరిహరింప

నపరజలనిధి జలకంబు లాడఁబోవు

కరణి, నెఱసంజ చందురుఁగావి పచ్చ

డంబు ధరఁ బెట్టి, భానుబింబంబుఁ గ్రుంకె!

విశ్లేషణ: Satyanarayana Piska గారు.

అస్తమిస్తున్న సూర్యబింబమును చిత్రవిచిత్రంగా ఉత్ప్రేక్షించాడు ఈ కవి.... తూర్పుదిక్కు అనే వధూమణి విసరగా, పశ్చిమదిక్కు అనే కాంత పట్టుకున్న ఎఱ్ఱని బంతి; కాలమనే విష్ణువు అంధకారమనే అసురునిపై ప్రయోగించగా, అస్తాద్రి వెంబడి పోతున్న సుదర్శనచక్రం; పగలు అనే చెట్టుకు తేజోమయంగా పండి రాలిపడుతున్న పెద్దపండు; దేవదానవ యుద్ధసమయములో రక్తముతో తడిసి, దివినుండి భువికి జారిపడుతున్న రథచక్రం అన్నట్టుగా అస్తమిస్తున్న రవిబింబం గోచరిస్తున్నదట! అంతేకాదు. పద్మినీసంగమం వల్ల కలిగిన అలసటను పోగొట్టుకోవడం కొరకు పడమటిసముద్రములో జలకేళి ఆడబోతూ, కట్టుకున్న కావిరంగు వస్త్రాలను ఒడ్డుమీద పెట్టి సముద్రములో మునుగుతున్నట్లుగా ఉన్నదట ఆ భానుబింబం..... ఎంత అద్భుతమైన వర్ణన!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!