శ్రీనాధ కవిసార్వభౌముడు--

శ్రీనాధ కవిసార్వభౌముడు--

శ్రీనాధుడికి పల్నాడు మీద మంచి అభిప్రాయం లేదు. రత్నాంబరాలూ, హేమ పాత్రాన్న భొజనమూ ఉన్నవాడికి ఏముంటుంది అక్కడ?

చిన్న చిన్న రాళు, చిల్లర దేవుళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు 

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు

కొల్లాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ తొడిగితిన్

వెల్లుల్లిన్ తిలపిష్ఠమున్ మెసవితిన్ విశ్వస్థ్థ వడ్డింపగా 

చల్లాయంబలి త్రాగితిన్ రుచుల్ దోసంబంచు పోనాడితిన్ 

తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాధుడన్.

కనీసం త్రాగటానికి మంచి నీళ్ళు కూడా దొరక లేదు కవిసార్వభౌముడికి. అందుకే:

సిరిగల వానికి చెల్లును

వరుసగ పదియారువేల వనితలనేలన్

తిరిపెమునకిద్దరాండ్రా

పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

సిరి మగసిరి ఐన శ్రీ కృష్ణుడు పదహారువేల వనితలను ఏలితే అర్ధం ఉంది, అడుక్కునేవాడికి నీకు ఇద్దరెందుకయ్యా పరమేశా, గంగను వదిలి పార్వతిని ఉంచుకోమంటున్నాడు కవి కలానికి ఉన్న విశృంఖలత్వంతో.

రసికుడు పోవడు పల్నా

డెసగంగా రంభయైన ఏకులె వడకున్

వసుధేశుడైన దున్నును

కుసుమాస్త్రుండైన జొన్న కూడే గుడుచున్.

అంతటి కవిసార్వభౌముడి చివరి రోజులు, పాపం:

కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి !

రత్నాంబరంబు లే రాయడిచ్చు ?

కైలాసగిరిపంట మైలారువిభుడేగె !

దినవెచ్చ మే రాజు తీర్చగలడు ?

రంభఁ గూడె తెలుంగురాయరాహుత్తుండు !

కస్తూరి కే రాజుఁ బ్రస్తుతింతు ?

స్వర్గస్థుడయ్యె విస్సనమంత్రి ! మఱి హేమ

పాత్రాన్న మెవ్వని పంక్తిఁ గలదు ?

భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె !

కలియుగంబున నికనుండఁ గష్టమనుచు

దివిజకవివరుల గుండియల్ దిగ్గురనగ

నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!