పగలే వెన్నెల జగమె ఉయల
ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు ఈ పాట. అంత అద్భుతమైన సంగీతం, సాహిత్యం, గాత్రం...
వెరసి ఈ పాట.. పాడింది S.జానకి గారు.
రాసింది మన తెలుగుజాతి గర్వించదగ్గ మహాకవి, జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత అయిన Dr.C నారాయణ రెడ్డి గారు.
ఈ మృదుమధురమైన భావాలని...వింటుంటే హాయిగా మబ్బుల్లో తేలుతున్నట్టుంటుంది. అసలు మన మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటి పాటలు వింటే చాలు. మనసుకు స్వాంతన కలుగుతుంది.
పగలే వెన్నెలా... జగమే ఊయలా...
కదిలే వూహలకే కన్నులుంటే...
పగలే వెన్నెలా... జగమే ఊయలా...
నింగిలోన చందమామ తొంగి చూచే..
నీటిలోన కలువభామ పొంగి పూచే..
ఈ అనురాగమే జీవన రాగమై...
ఈ అనురాగమే జీవన రాగమై...
ఎదలో తేనెజల్లు కురిసిపోదా....
పగలే వెన్నెలా...జగమే ఊయలా...
కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసే..
మురళిపాట విన్న నాగు శిరసునూపే..
ఈ అనుబంధమే మధురానందమై...
ఈ అనుబంధమే మధురానందమై...
ఇలపై నందనాలు నిలిపిపోదా...
పగలే వెన్నెలా....జగమే ఊయలా...
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే...
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే...
మనసే వీణగా ఝన ఝన మ్రోయగా...
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా...
పగలే వెన్నెలా....
Comments
Post a Comment