ఉదృతంగా ప్రవహించేటప్పుడు పెద్ద చెట్లని పెకలించి వేస్తారు. కానీ చిన్న రెల్లుగడ్డిని మాత్రం ఏమి చేయరు ఎందుకు?

ఒకరోజు సముద్రుడు తన భార్యలైన గంగ, కావేరి, సింధు, నర్మదా, కృష్ణ, గోదావరి మొదలగు నదులతో కలిసి సరస సల్లాపాలతో మునుగి ఇష్టాగోష్టి మాట్లాడుతూ ఒక సందేహాన్ని అడిగాడు.

మీరు ఉదృతంగా ప్రవహించేటప్పుడు పెద్ద చెట్లని పెకలించి వేస్తారు. కానీ చిన్న రెల్లుగడ్డిని మాత్రం ఏమి చేయరు ఎందుకు?

స్వామి ఇది చాల చిన్న సందేహం. వినండి చెప్తాము. పెద్ద చెట్లు మేము సన్నగా ప్రహిస్తుండగా స్థలాన్ని ఆక్రమించి విర్రవీగుతాయి. ఉదృతంగా ప్రవహించే సమయంలో నన్నేమి చేయలేరు అని ఎదురొడ్డి నిలబడతాయి. అలా నిలబడినప్పుడు మేము వాటిని పెకిలించి వేస్తాము. ''బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి బ్రతుకగ మేలా''? నేను బలవంతుడనని విర్రవీగే వాడిని కచ్చితంగా కూలిపోతాడు ఏదో ఒకనాటికి. రెల్లు గడ్డి అలాకాకుండా! మేము ఎలా ఉన్న దగ్గరికి రాగానే తలవంచి నిలబడుతుంది. దీనితో మేము ఏమి చేయం. మా ఉదృతి తగ్గిపోగానే గర్వంగా లేచి నిలబడతాయి. ఇందువలన రెల్లుగడ్డి తన జీవనం కొనసాగిస్తుంది. అన్నారు.

ఇది మనకి కూడా వర్తిస్తుంది. ఎక్కువ చదువుకున్నాను అని కొందరు, బాగా సంపాదించానని కొందరు, అర్ధంతరంగా సంపదలు పొందితే నా అంతవాడు లేదని కొందరు, ఎందులోనైన విజయం సాదిస్తే నా అంత పోటుగాడు లేడని కొందరు, తెలివితేటల్లో న అంతవాడు లేడని కొందరు, మిడిమిడి జ్ఞానంతో విర్రవీగేవారు ఇంకొందరు. ఇలా వారి నాశనాన్ని వారె చేజేతులారా తెచ్చుకుంటున్నారు. 

ఎంత జ్ఞాని అనుకున్నవాడైనా కొన్ని ప్రశ్నలకి బదులు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఒక తరగతిలో వచ్చిన మార్కులు మరొక తరగతిలో ఎందుకు రావడంలేదు? ఎవరో కోట్లు సంపాదించుకు తిరుగుతుంటేకొందరు చిరిగిపోయిన కోట్లు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? ఆకలిని ఎందుకు అదుపుచేయలేక పోతున్నారు? నిద్రని ఎందుకు అదుపుచేయలేకపోతున్నారు? మనసుని, కోపాన్ని, రుచిని ఇలా దేన్నీ అదుపు ఎందుకు చేయలేకపోతున్నారు?

ఏది మన చేతుల్లో లేదు. ఈ విషయాన్ని గ్రహిస్తే అంతర, భాహ్య ఇంద్రియాలని నిగ్రహిస్తే అప్పుడు తెలుస్తుంది నిజం ఏమిటో! అంతేకాని పైపైన కనపడేవి చూసి ఇదే నిజమనినమ్మితే ఈ సంసార చట్రంలో ఇరుక్కొని భాదలు పడాల్సిందే! నువ్వు నేను అనుకుంటూ బ్రతకాల్సిందే! ఎన్నో దిక్కుమాలిన జన్మలు ఎత్తల్సిందే! తప్పదు. ఏదీ నీచేతుల్లో లేదు. అలాగని ప్రతీదీ దేవుడిమీద భారం వేయమని కాదు. నీపని నువ్వు చెయ్యి. ఫలితం ఆయనమీద వదిలేసేయండి. అప్పుడు లాభం కలిగిన నష్టం కలిగినా బాధ మాత్రం కలుగదు.."

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!