ఈ వారం కవిత::: కవి-

@ Patwardhan M.V.

 ఈ వారం కవిత::: కవి--వింజమూరి వెంకట అప్పారావ్ 
కవితలు చాలా మంది రాస్తారు.అయితే చూడగానే ఇంతేనా అనిపించినా దిగితేనే కానీ లోతు తెలియని విధంగా రాయడం మాత్రం మహా కవుల లక్షణం.గొప్ప సామాజిక స్పృహతో కూడిన కవిత.చిన్న పదాల్లోనే పెద్ద అర్థాన్ని చెప్పాడు. 

కచ్చగా రాసా నేనొక కవిత---ఇక్కడే కవి ప్రతిభ తెలుస్తుంది.కచ్చగా అంటూ ఎత్తుకున్నాడు.ఎవరి మీద,ఎందుకు అనేది చెప్పలేదు.అలా పఠితల ఊహలకు కొన్ని వదిలివేయడమే మహా కవుల లక్షణం.కప్పి చెప్పేదే కవిత్వం. కవికి సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కచ్చ ఉంది.

కసి గా తీసుకొచ్చి చదువుతా---ఈ వాక్యంలో కవి తన కవితకు పాఠకులు/శ్రోతలను నిర్ణయించుకుంటున్నాడు.ఇక్కడ శ్రోతలు ఎవరో కాదు.అన్యాయాయాలూ,అక్రమాలూ చేసే వారే !ఇలా స్పష్టంగా తన పాఠకులను నిర్ణయించుకోవడమూ ఉత్తమ కవి లక్షణమే! 

వినకపొతే మీ అందర్ని నరుకుతా--ఇక్కడ బయటకు తన కవితను వినక పోతే అని ధ్వనిస్తున్నా నిజానికి తాను చెప్పిన లేదా వెలిబుచ్చిన అంశాలను,అవగతం చేసుకొని మారకపోతే అని నర్మగర్భితంగా చెపుతున్నాడు.నరకుతా -అనడం ద్వారా తాను సమాజాభ్యుదయం కోసం సాయుధ విప్లవానికి సిధ్ధమేనని సందేశం ఇస్తున్నాడు.

అది విని బతికితె మళ్ళీ చదువుతా.. 
మళ్ళీ చదువుతా..మళ్ళీ చదువుతా..///ఈ వాక్యం మొత్తం కవితకు ఆయువుపట్టు.గొప్ప భావాన్నో,ఉద్వేగాన్నో వెలిబుచ్చేటప్పుడు పునరావృత్తి అందాన్నిస్తుంది. పునరావృత్తి ప్రధానంగా జానపద కవిత్వ లక్షణం, ఇక్కడ కవి తాను మళ్ళీ మళ్ళీ చడువుతా అనడం ద్వారా తన ప్రయత్నాలకు ఎన్ని ఆటంకాలెదురైనా వెనుకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞా పూర్వకంగా చెపుతున్నాడు.

నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో వచ్చిన అతి కొద్ది గొప్ప కవితల్లో వింజమూరి వెంకట అప్పారావ్ గారి ఈ కవిత ఒకటి.కవికి అభినందన లు.ఈ కవి ఇలాంటి ఉత్తమ శ్రేణి కవితలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను. 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!