ద గ్రేట్ స్టుపిడిటి
ద గ్రేట్ స్టుపిడిటి
నా కిప్పుడు జనం కావాలి.
పల్లకీలో ఎక్కించి,.
ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే
బలిసిన భుజాలు లాంటి జనాలు.
రెండు మెతుకులు కూడు కోసం,
కుక్కల్లా కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు.
పొదుగుల నుండి రక్తం పిండుతున్నా
ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు.
రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో
తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు,
నాకిప్పుడు జనం కావాలి.
మనుషులమనే మరిచిపోయిన
గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి
ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు
అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు
మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే,
సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు.
నాకిప్పుడు జనం కావాలి.
కళ్లుండి చూడని జనాలు,
మెదడుండి ఆలోచించని జనాలు,
కాళ్లూ చేతులూ వుండి
పనిచేయని సోమరి జనాలు.
బతుకంటే ఏంటో తెలియని జనాలు,
బతకడం చేతకాని జనాలు,
బీజమూ లేక, అండమూ రాక
కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే
నపుంసకుల్లాంటి జనాలు కావాలి.
నాకిప్పుడు జనం కావాలి.
నేననుకొనెట్లు మాత్రమే ఆడగల
బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు.
నా కిప్పుడు జనం కావాలి.
పల్లకీలో ఎక్కించి,.
ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే
బలిసిన భుజాలు లాంటి జనాలు.
రెండు మెతుకులు కూడు కోసం,
కుక్కల్లా కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు.
పొదుగుల నుండి రక్తం పిండుతున్నా
ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు.
రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో
తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు,
నాకిప్పుడు జనం కావాలి.
మనుషులమనే మరిచిపోయిన
గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి
ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు
అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు
మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే,
సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు.
నాకిప్పుడు జనం కావాలి.
కళ్లుండి చూడని జనాలు,
మెదడుండి ఆలోచించని జనాలు,
కాళ్లూ చేతులూ వుండి
పనిచేయని సోమరి జనాలు.
బతుకంటే ఏంటో తెలియని జనాలు,
బతకడం చేతకాని జనాలు,
బీజమూ లేక, అండమూ రాక
కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే
నపుంసకుల్లాంటి జనాలు కావాలి.
నాకిప్పుడు జనం కావాలి.
నేననుకొనెట్లు మాత్రమే ఆడగల
బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు.
greetings sir...
ReplyDeleteమరేమనుకోకండి...
అచ్చమైన ప్రస్తుత రాజకీయ నాయకుడి
రిక్వైర్మెంట్స్ చెప్పారే...
ఇప్పుడున్న జనాలు చాలామంది
మీ వర్ణనలకు సరిపోయే వారే...
ప్రతి నాయకుడి ఊరేగింపులో...
జయజయ ధ్వానాలు పలికేదీ...
మళ్ళీ మళ్ళీ గెలిపించేదీ...
ప్రతిరోజూ పేపర్లో న్యూస్/ఫోటోల నిండేదీ...
జస్ట్ మీరు పర్సు తీయడమే తరువాయి...
కావాల్సినంత మంది...