కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ నివేదన -

కాంచన విపంచి

- శ్రీమతి చావలి బంగారమ్మ 

నివేదన -

చూచివచ్చిన మాట తేటపడగాను

నోటజెప్పుట నీకు చేతకాదనుము

చురుకు గల చూపులతొ సూర్యుడా! నీవు

చూడలేవైతివా సున్నితపు విభుని

మనసు మెత్తనివాడు మహమంచివాడు

మాటాడ వెరతురూ మనబోటివారు

మగువలకు భయమన్న మరినమ్మవచ్చు

మగవారికేలయ్య మాటాడభయము

మగవారికైననూ మాటలాడుటకు

మనసు తెలుపని వాని మరులేలతిరిగె

పగలె పరికిస్తావు పారిపోతావు

చీకటిని జూచితే చిక్కుతాడేమొ

కునికిపాటున నీవు కునుకుతావేమొ

కుముదబాంధవునైన కూకలెట్టుమను.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.