పాపయ్య బొమ్మలకీ, బాపూ బొమ్మకీ తేడా స్పష్టంగా చెప్పగలం.!


బాపు బొమ్మల్లో ఎక్కువగా పదేపదే ఒకే తరహా రంగులు కనిపిస్తాయి. అందువల్ల కొన్ని బొమ్మలు ఎంతో అర్థవంతంగానూ, గీతలు అందంగానూ ఉన్నా బొమ్మ కొట్టవచ్చినట్లు కనిపించదు. కొన్ని బొమ్మలకయితే రెండు మూడు రంగులు దాటి లేవు. ఉదాహరణకి ఈ బొమ్మలే చూడండి.
ఒకటి, రామలక్షమణులు, సీత, హనుమంతుడు ఉన్నది. రాముడి శరీరం రంగూ, లక్ష్మణుడి పంచ రంగూ ఒకటే! అలాగే సీత చీర రంగూ, హనుమంతుడి పంచె రంగూ కూడా ఒకటే! ఈ రంగులు ఉండకూడదని కాదు. చిన్న బొమ్మ వేసేటప్పుడు బొమ్మలో ఉన్న వివిధ అంశాలకీ రంగులు చాలా స్పష్టత ఇస్తాయి. గీత ఎంతో అద్భుతంగా ఉంది. రంగుల దగ్గరకొచ్చేసరికి సర్దిపెట్టుకోవాలి.
పాపయ్య బొమ్మలకీ, బాపూ బొమ్మకీ తేడా స్పష్టంగా చెప్పగలం.!
వడ్డాది పాపయ్య చిత్రాలకి రంగులే ఎక్కువ కళ తీసుకొచ్చాయి. రంగుల విలువ (color value) స్పష్టంగా వాడుకోవడం వలన అదే కోవకి చెందిన రంగయినా స్పష్టంగా తేడా తెలుస్తుంది. ఇంకొకటేమిటంటే ఖచ్చితమైన రంగు విలువ చిత్రానికి లోతు, గంభీరత తీసుకొస్తుంది. వస్తు పరిమాణం వచ్చి బొమ్మలు మరింత అందంగా ఉంటాయి. ఆయిల్ పెయింటింగ్స్‌కి వన్నె తెచ్చేవి ఈ రంగుల విలువలే! వడ్డాది పాపయ్య చిత్రాలకి అందం తెచ్చిన అంశం ఇదే!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!