శబ్ద, అర్ధాంలకారాలు .. వేటూరిగారు !


శబ్ద, అర్ధాంలకారాలు .. వేటూరిగారు !
ఆరేసుకోబోయి,పారేసుకున్నానని ద్వంద్వార్ధాలు పలికే పాటలు రాసిన
వేటూరిగారి పాటల నిండా శబ్ద, అర్ధాంలకారాలు మనని ఆశ్చర్య పరచక మానవు.
.

కుశుమించు అందాలు కుశలమా? వికసించే పరువాలు పదిలమా?

గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది, గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది

మా ఱేడు నీవని ఏరేరి తేనా, మారేడు దళములు నీ పూజకు

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ

ఓ చుక్కా నవ్వే నావకు చుక్కానవ్వే

ఏకులమూ నీదంటే గోకులమూ నవ్విందీ

పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా?

కైలాసాన కార్తీకాన శివరూపం,ప్రమిదేలేని ప్రమధాలోక హిమదీపం

నెమలికి నేర్పిన నడకలివీ, మురళికి అందని పలుకులివీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొకొల్లలు.

సరళమైన పదాలతో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.... వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయెలే అంటూ ఆర్ద్రతతో రచనలు చేసిన వేటూరిగారు ఒకనానొక సందర్భంలో, ‘తెలుగులో రాయడానికి తగిన అమరిక ఈనాటి యుగళ గీతాలలో లేదు. సందెగాలి, చందమామ, మల్లెపూలు, మంచిగంధం, ఏటివొడ్డు, పడవ ప్రయాణం, గుడి గంటలూ, ఆకుపచ్చ చేలూ, చిలకపచ్చ చీరలూ, కట్టూ బొట్టూ, గుట్టూ మట్టూ లేని శృంగారానికి సరిపోవని తెలుగు భాష ఏనాడో సవినయంగా ఒప్పుకుంది. ‘‘సీతారామయ్య గారి మనవరాలు” తరువాత నేను రాసిన తెలుగు పాటల్లో నేనే తెలుగుతనాన్ని వెతుక్కోవాల్సిన స్థితిలో పడ్డానని వాపోయారు. వినోదమే ప్రధానమై సినిమా పాటల్లో, తెలుగు మాట, తెలుగు పదం, తెలుగు నుడికారం ఏరువాకై సాగాలనుకోవడం అత్యాశే!

కృతజ్ఞతలు ..సౌమ్యశ్రీ రాళ్లభండి, తేటగీతి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!