“ధర్మరాజు మీద ఒక చిన్న వ్యాసం...


“ధర్మరాజు మీద ఒక చిన్న వ్యాసం...మార్కులు నావి.. వ్యాసం మీది!
.
ధర్మరాజు శాంతమూర్తి. మృదు స్వభావి. ధర్మాధర్మ విచక్షణ కలవాడు
అందుకనే అతనిని ధర్మరాజు అనేవారు. అసలు పేరు యుధిష్టరుడు.
అతను భీమార్జున నకుల సహదేవులకు అన్నగారు. వారు ఇతని సోదరులు.
భీమార్జునులు మహా బలవంతులైనను ఇతని చెప్పుచేతలలో ఉండెడివారు.
అన్నగారనిన వారికి అనురాగము, ప్రేమ, వాత్సల్యము మెండుగా యుండెడివి.
ఇంత ప్రేమ బడయుట అతని వ్యక్తిత్వము వల్లనే కదా.
ఇంత గొప్ప వ్యక్తిత్వము గల ధర్మరాజునకు జూదమాడుట యందు కడు నాశక్తి. జూదమాడినను ధర్మమును వదిలెడు వాడు కాదు. ధర్మ జూదమే ఆడెడివాడు.
జూదమనగా ఆ కాలమున పాచికలతో నాడెడి వారు.
నేటి పేకాటలు నాడు బహుశా ఉండిఉండవు.
ధర్మరాజు పేకాట ఆడినట్టు ఎక్కడా వ్రాయబడలేదు.
పాచికలతోనే ఆడెడి వాడు అని భారతములో లిఖింప బడినది.
ధర్మరాజు జూద గృహములలో జూదమాడెడి వాడు కాదు.
రాజ్య సభల్లోనే నాడెడి వాడు. ఇది అతని వ్యక్తిత్వము లోని ఔన్నత్యమును
సూచించు చున్నది కదా.”

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!