కూర్మావతారం........సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు!

కూర్మావతారం........సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు!
.
కూర్మావతారం ద్వారా మనిషి నేర్చు కోవలసిన ముఖ్యమైన లక్షణాలు పట్టుదల, ఓర్పు , సహనం అని సీతారామ శాస్త్రి గారు వివరించిన విధానం నిజంగా అమొఘం.. మనం ఏమైనా గొప్ప గొప్ప ఘనకార్యాలు తలపెట్టేటప్పుడు ఆ పని భారం మంధర పర్వతం లాగ చాలా బరువుగా అనిపించి ఒకొక్కసారి వొదిలెయ్యాలనిపిస్తుంది.. దానికి తోడు తనను తాడు లాగా ఉపయోగిస్తున్న వాసుకి సర్పం బుసలు కొట్టే విషపూరితమైన అసహనపు నిట్టూర్పు సెగలు పరిస్థితులను ఇంకా తీవ్రతరం చేసినా కానీ పొందవలసినదందలేదని నిరాశ నిస్పృహలతో నీరశించకుండా ఓర్పుతోను, పట్టుదలతోను నొప్పిని సహిస్తూ అడుగు ముందుకెస్తే ఓటమిని కూడా ఓడించగలిగే అవకాశం ఉంటుందని, విజయం వరించడం ఖాయమని కూర్మావతారమర్మం అంటూ ఈ క్రింద అయిదు వాక్యాలతో అద్భుతంగా తెలియజేసారు .
.
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే...
పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే....
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక....
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది...
క్షీర సాగర మధన మర్మం....


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!