వటపత్ర సాయికి వరహాల లాలి


చాలా రోజుల తర్వాత ఇవాళ అమ్మగుర్తుకొస్తోంది.
విడివడిన కొప్పును జడ వేసుకోవాలనే తీరిక కూడా లేకుండా వొంచిన
నడుము ఎత్తకుండా నీ కోసం నా కోసం అన్న కోసం చెల్లి కోసం
చెమటను చిందించిన అమ్మ గుర్తుకొస్తోంది.
ఆమె పవిట పట్టుకొని తిరిగి ఎన్నాళ్లయ్యిందో! ఆమె పాడిన పాటను విని ఎన్నాళ్లయ్యిందో! ఆ జోలకు ఆదమరిచి ఒడిలో తల పెట్టుకొని నిదురించి ఎన్నాళ్లయ్యిందో.

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి…
ఆపు. చాలా బాగుందిగాని ఆపు. కసువుచిమ్మే పిలగాణ్ణి. గొడ్లు కాసే కసిగాణ్ణి. మా అమ్మ ఇలా పాడదే. మీ అమ్మ ఇలా పాడి ఉంటుందా? కాస్త మామూలు మాటల్లో పాడవయ్యా తల్లీ.
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు
గోపాల క్రిష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!