వర్షం!

వర్షం

ఏంటో ఈ జీవితం పైకెగిరిన ప్రతిసారి కొత్తగా ఉంటుంది. 

కొత్త అనుభూతులను పంచుతుంది. అటువంటి స్వచ్చమైన అనుభూతులే వర్షం పుడమిని తాకిన ప్రతిసారి సంభవిస్తాయి. 

చినుకులు బుగ్గలను తాకితే ఒక అనుభూతి, శిరోజాలను ముద్దాడితే మరో అనుభవం. 

వర్షంలో తడిసిన, తడిమిన ప్రతిక్షణమూ తన్మయత్వం చెందుతున్న అపురూప క్షణమే. 

వర్షం బాధను తగ్గిస్తుంది. సంతోషాన్ని పెంచుతుంది. కన్నీటిని తనలో కలిపేసుకుంటుంది. మాటలకందని అనుభూతులకందే విషయాలన్నీ వర్షంలో దాగున్నాయి.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!