వినాయక చవితి శుభాకాంక్షలు !!
వినాయక చవితి శుభాకాంక్షలు !!
మీకు మీ కుటుంబానికి గణేశుని అనుగ్రహం సదా లభించు గాక !!
బాలుల పండగ ఈ వినాయక చవతి వారికి నా దీవెనలు
శ్రీ గణ నాధం భజామ్యహమ్
వక్ర తుండ మహా కాయం
సూర్య కోటి సమప్రభం
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వ కార్యేషు సర్వదా !!
.
పూజా విధానం!
.
వినాయక చవతి వ్రతకల్పం
ఆచమనం:
ఓం శివాయ స్వాహాః, మహేశ్వరాయ స్వాహాః శంభవే స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా, యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.
ప్రాణాయామము చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను.
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......
ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, సిద్ది విణాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః, మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతః కుక్షౌత్సాగరాసర్వేసప్త ద్వీపా వసుంధర, ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వనః అన్గైస్చ సాహితాసర్వే కలశాంబు సమాశ్రితః.
ఆకలశేశ్లో: గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సొందు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు|| కావేరి తున్గాభాద్రాచ క్రుష్ణవేన్యాచ గౌతమీ| భాగీరదీచ ప్రఖ్యాతాః పంచాగంగాః ప్రకీర్తితితః ఆయాంటూ దేవపూజార్ధం మమ (యజమానస్య) దురితక్షయకారకాః కలశోధకేన పూజా ద్రవ్యాని సంప్రోక్షయః.
(కలశములోని నీళ్ళను పూజా ద్రవ్యములపైన, దేవునిపైన, తమ శిరస్సుపైన కొద్దిగా చల్లుకోవాలి)
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
శ్రీ మహా గణాధిపతయే నమః ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥
శ్రీ మహా గణాధిపతయే నమః ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
శ్రీ మహా గణాధిపతయే నమః పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥
ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥
మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥
పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥
శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥
వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥
ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥
గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
పుష్పాణి పూజయామి.
అథాంగ పూజ:
(పుష్పములతో పూజించవలెను)
గణేశాయ నమః - పాదౌ పూజయామిఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామిశూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామివిఘ్నరాజాయ నమః - జంఘే పూజయామిఅఖువాహనాయ నమః - ఊరూ పూజయామిహేరంబాయ నమః - కటిం పూజయామిలంబోదరాయ నమః - ఉదరం పూజయామిగణనాథాయ నమః - నాభిం పూజయామిగణేశాయ నమః - హృదయం పూజయామిస్థూలకంఠాయ నమః - కంఠం పూజయామిగజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామివిఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామిశూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామిఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామిసర్వేశ్వరాయ నమః - శిరః పూజయామివిఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి ఏకవింశతి పత్రపూజ:
(21 విధముల పత్రములతో పూజింపవలెను)
సుముఖాయనమః -మాచీపత్రం పూజయామి। గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి। ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి। గజాననాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి| హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి। లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి। గుహాగ్రజాయనమః -అపామార్గపత్రం పూజయామి। గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి| ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి| వికటాయ నమః -కరవీరపత్రం పూజయామి। భిన్నదంతాయ నమః -విష్ణుక్రాంతపత్రం పూజయామి| వటవేనమః - దాడిమీపత్రం పూజయామి| సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి| ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి| హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి| శూర్పకర్ణాయనమః -జాజీపత్రం పూజయామి| సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి| ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి| వినాయకాయ నమః -అశ్వద్దపత్రం పూజయామి| సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి। కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.
శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥
ధూపమాఘ్రాపయామి॥
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపందర్శయామి।
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,
భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,
నైవేద్యం సమర్పయామి।
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణపుష్పం సమర్పయామి.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం
తాంబూలం సమర్పయామి।
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి।
అథ దూర్వాయుగ్మ పూజా
గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,
పునరర్ఘ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.
Comments
Post a Comment