బాపు వేసిన మొదటి బొమ్మ ‘సంసారం’

బాపు వేసిన మొదటి బొమ్మ ‘సంసారం’ చూడండి. 

బొమ్మ ముందు భాగంలో తల్లీ కొడుకూ ఉంటే, భార్యా పిల్లాడు వెనక్కి నెట్టేయబడ్డారు. ఈ చిత్రంలో దృష్టికోణం కొడుకు మీదుగా తల్లినుండి మిగతా వారికి చేరేట్లా వేశారు. అప్పట్లో ఇది కొత్తగా అనిపించి ఉండవచ్చు. తెలుపు-నలుపు చిత్రం కాబట్టి రంగుల ప్రసక్తి లేదు. ఇదే బొమ్మ ఇప్పుడు వేసుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవడం అంత కష్టం కాదు. ఇలా మాత్రం ఖచ్చితంగా వేసుండేవారు కారు.పూర్వకాలంలో చాలా కుటుంబ విషయాలు భోజనాలదగ్గరే ప్రస్తావనకొచ్చేవి. ఆడవాళ్ళకి ఇంటి మగాళ్ళు కుదురుగా అందుబాటు లోకి వచ్చే సమయం అదొక్కటే!
తల్లి భోజనం వడ్డిస్తూ కొడుకుతో ఏదో చెబుతోంది. దూరంగా కోడలూ, ఒళ్ళో చిన్న పిల్లాడూ, ఇవన్నీ చూడగానే మనకి ఏదో చర్చిస్తున్నారన్న ఊహ వచ్చేస్తుంది. చర్చా విషయం ఏవిటన్నది కథ చదివితే ఎలాగూ అర్థమవుతుంది. కానీ కథ పేరూ, బొమ్మా చూడగానే పాఠకులకి మరింత కుతూహలం పెరుగుతుంది. వ్యాఖ్యా చిత్రకారుల ముఖ్య లక్షణం ఇదే! బాపు ఇది ముందే గ్రహించినట్లుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!