శ్రీ శ్రీ గారి మీసం మీద సీసం
శ్రీ శ్రీ గారి మీసం మీద సీసం
.
‘కుమ్మరి మొల్ల’ సినిమాలో మొల్ల ప్రతిభను పరిశీలించడానికి తెనాలి రామలింగడు సమస్యను ఇచ్చే సందర్భంలో ఒక పద్యం రాయవల్సి వచ్చి
శ్రీశ్రీగారు, అవధాన ప్రక్రియలో అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు అనే దత్తపదాలను తీసుకొని
పద్యంలో అప్పు అంటే ఋణం, నిప్పు అంటె అగ్ని, మెప్పు అంటే ప్రశంస, చెప్పు అంటే పాదరక్ష అనే అర్ధాలు రాకుండా ఈ కింది కంద పద్యం రాశారు

అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్!
.
అగాథమవు జలనిధిలోనా అణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అని వేదాంత సారాన్ని హృద్యంగా చెప్పగలిగే అభ్యుదయ కవి నుంచి ఇలాంటి పద్యాన్ని ఎవరూ ఊహించరు.
లాగే ఆ మహాకవి కులగోత్రాలు సినిమా కోసం మీసం మీద రాసిన సీసం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుందాం.
కారుమబ్బుల బారు సేరునేలెడి తీరు
కోరమీసము పొందు కొరుకొందు
మృగరాజు జాలునే తెగనొడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు
ఎవరు మోయుచున్నారు ఈ అవని భారము
ఆదిశేషుడా, కూర్మమా, కాదు కాదు
అష్టదిగ్గజ కూటమా? అదియు కాదు

This comment has been removed by a blog administrator.
ReplyDelete