బాల సాహితీ !

బాల సాహితీ !
ఇందు భౌతికస్వభావము వరుస చొప్పునఁ జెప్పఁబడుటచే
బాలుఁ డా వరుస నంటు కొని, యొకటి రెండు మారులు వినినంతనే
తప్పకుండఁ బదము నప్పగింపఁగలడు
..ఎండలు కాసే దెందుకురా?
మబ్బులు పట్టే టందుకురా.
మబ్బులు పట్టే దెందుకురా?
వానలు కురిసే టందుకురా.
వానలు కురిసే దెందుకురా?
చెరువులు నిండే టందుకురా.
చెరువులు నిండే దెందుకురా?
పంటలు పండే టందుకురా.
పంటలు పండే దెందుకురా?
ప్రజలు బ్రతికే టందుకురా.
ప్రజలు బ్రతికే దెందుకురా?
స్వామిని కొలిచే టందుకురా.
స్వామిని కొలిచే దెందుకురా?
ముక్తిని పొందే టందుకుర
(వేటూరి గారి బాల సాహితీ నుండి సేకరణ)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!