Posts

Showing posts from October, 2017

ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’

Image
- లలిత ,రాగిణి ,పద్మిని--                                                              - లలిత ,రాగిణి ,పద్మిని- ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’  . కొచ్చిన్ సిస్టర్స్ తో ప్రోగ్రాం.  ఆర్గనైజర్స్ హడావుడి పడిపోతున్నారు. . ‘ఎక్కడ ఎక్కడ వారు?’ అని వెతుకుతున్నారు.  . ఇది గమనించి శ్రీశ్రీ ‘ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’ అన్నారు . ( ఎందుకొచ్చిన అని ఒక అర్ధం, ఎందు? అని ప్రశ్న రూపంలో ఒక అర్ధం). {కొచ్చిన్ సిస్టర్స్ చిత్రం - లలిత ,రాగిణి ,పద్మిని-} -

ముళ్ళపూడి ..వారు పేల్చిన జోకులు !

Image
. టీచర్ పిల్లవాడిని ‘గుఱ్ఱము’ అని రాయమంటాడు. పిల్లవాడు ‘గఱ్ఱమ’ అని రాసుకొస్తాడు. ‘ఇదేమిట్రా?’ అని టీచర్ కేకలేస్తాడు. పిల్లవాడు అంటాడు : ‘మీరే కదా అన్నారు టీచర్ - ‘గుఱ్ఱము’ నకు కొమ్ములుండవు అని’ ( అసాధ్యమిది వేరే భాషలో) . కృష్ణుడు తలుపు తీసి చూస్తే ఎదురుగా స్త్రీ మూర్తి ఉంటుంది. ‘అరె మీరా?’ అంటాడు కృష్ణుడు. . ‘మీరా కాదు సక్కుబాయి’ –ఆ స్త్రీ సమాధానం (ఎలాగండి- వేరే భాష వారికి ఈ జోక్ చెప్పేది?

గోమాత సర్వ శుభ రూపిణి !

Image
గోమాత సర్వ శుభ రూపిణి ! - “సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం  సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం” . సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని,  వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని,  గోమాత యజ్ఞమునకు తల్లి వంటిదని ఈ శ్లోకం అర్థం. గోమాత సర్వ శుభ రూపిణి.  ముక్కోటి దేవతలకు నిలయం గోమాత.

శుభరాత్రి -సౌందర్య లహరి ! **** 6*** .

Image
శుభరాత్రి -సౌందర్య లహరి ! **** 6*** . శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా | ధనుర్బాణాన్‌ పాశం సృణి మపి దధానా కరతలైః పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా || . గణగణమని మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన మొలనూలు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే కుచముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడి  వంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని,  పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్నిచేతుల్లో ధరించినదీ, త్రిపురాలను మట్టుపెట్టిన శివుడి శౌర్యస్వరూప ఐన భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!.

మళ్ళీ జరగదు…ఒక సరి కొత్త ..పాత జోకు!!

Image
మళ్ళీ జరగదు…ఒక సరి కొత్త ..పాత జోకు!! (ఈ జోకు నాది కాదు ఎవ్వరిదో తెలియదు.) - ఒకాయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. జైల్లో కొద్ది రోజులు  ఉండే సరికి ఆయనికి విసుగొచ్చింది.దగ్గర్లో ఉన్న ఒక చీమను  పట్టుకుని దానికి కొన్ని ట్రిక్స్ నేర్పించాలనుకున్నాడు. ఎగరడం, దొర్లడం,పిల్లిమొగ్గలేయడం లాంటివి. అన్ని సంవత్సరాలపాటు శిక్షణ ఇచ్చి దాన్ని ఎలా చెబితే అలా చేసేలా తయారు చేశాడు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత దాన్ని ఒక అగ్గిపెట్టెలో పెట్టుకొని బయటకు వచ్చాడు. బార్ లోకి వెళ్ళాడు. ఒక దగ్గర కూర్చుని అగ్గిపెట్టె లోనుంచి చీమను బయటకు వదిలాడు. పక్కనున్న అతనితో “ఇప్పుడు ఈ చీమ నేను ఎలా చెబితే అలా చేస్తుంది. చూడు” అన్నాడు. అతను ఆశ్చర్యపోతూ “ఏదీ చూపించండి?” అన్నాడు. జైల్లో తను ఆ చీమకు నేర్పించిన ట్రిక్కులన్నీ చూపించాడు. అవతలి వ్యక్తి సంభ్రమంగా “దీంతో నువ్వు చాలా డబ్బు సంపాదించవచ్చు. నీ పంట పండినట్లే ” అన్నాడు. దాంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయి మన హీరో పక్కనే ఉన్న బేరర్ ని పిలిచి ” ఏమోయ్ ఈ చీమను చూశావా?” అన్నాడు. వాడు వెంటనే దగ్గరికి వచ్చి ఆ చీమను చేత్తో నలిపేసి. ” సారీ సర్ ఇంకెప్పుడూ అలా...

యాత్రలు-కాశీ ప్రయాగ!

Image
. యాత్రలు-కాశీ ప్రయాగ! . సీ.కాలాడినప్పుడే కావాల్సిన పనులు  చేసినంత సమకూరు సుభ మిలను.  కాలాడి నప్పుడే కాశీ ప్రయాగల  యాత్రలు చేయనూహించవలయు  చేతనున్నప్పుడే చేయు దానములన్ని  చేతులాడినప్పుడే చేయు పనులు  కన్నులున్నప్పుడే కరువార తిలకించు  కమలనాధుచరణ కమలములను.  . ఆ. చెవులు వినగలిగిన చక్కని భజనలు చెవులకు వినిపించు జలవు మీర పలుకు గలిగినపుడే పరమేశు నామము పరిపరివిధములను పలుకుచుండు. . (ఇది మా అక్క Suryalakshmi Taranikanti గారి పద్యం.)

కార్తీక పురాణం 12వ రోజు!!

Image
- కార్తీక పురాణం 12వ రోజు!! - ద్వాదశీ ప్రశంస: మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కార్తీక శుద...

సిద్దేంద్రయోగి...వారి గురువు నారాయణతీర్థులు"!

Image
. సిద్దేంద్రయోగి...వారి గురువు నారాయణతీర్థులు"! . నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని  తరంగాలు పాడుకునేవారు. బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు. తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?" "బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..." "అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"! "ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీనుగుని నాకు కనపడ్డేం!" అని కళ్ళు తుడుచుకునీ "ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..." "ఓ......అలాగే"అన్నాడు సిద్దప్ప... మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు. "నీకు ఈ జన్మలోనే...(నా దర్శనం అయ్యిందిగా....

శుభం...శ్రీకాళహస్తీశ్వరా !

Image
శుభం...శ్రీకాళహస్తీశ్వరా ! . పవిపుష్పంబగు, నగ్నిమంచగు,నకూపారంబు భూమీస్థలం బవు,శత్రుండతిమిత్రుడౌ,విధముది వ్యాహారమౌనెన్నగా నవనీమండలి లోపలున్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ!నీ నామము సర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా! . శ్రీకాళహస్తీశ్వరా! ఈ భూమియందు నీమహిమగల నామమైన "శివ శివ"యని నామోచ్చారణము చేయువానికి కఠినమైన వజ్రము సుకుమారమైన పువ్వుగాను,అగ్నిమంచుగాను, సముద్రము భూమిగాను,శత్రువు మిత్రుడుగాను, విషము గొప్పరుచికరమైన ఆహారముగాను కన్పట్టు చుండును.పరికించగా నీ పేరు అన్నింటిని వశము చేసుకోనునట్టిది అని తెలియును.

బోల్ రాధా బోల్ అమ్మడు..!!

Image
                                బోల్ రాధా బోల్ అమ్మడు!! మన బోల్ రాధా బోల్ అమ్మడు... ఇప్పుడు ఎలాగుందో... మనం అనుకోవడమే గాని... వారి లోకం వారిది !!

మా దివాకర్ల వెంకట అవధాని సార్ !!

Image
మా దివాకర్ల వెంకట అవధాని సార్ !! . తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలోఎంత గాఢానురక్తిని  క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్‌ను తప్పించుకునే వాళ్లం కాదు.  ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం. పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా  చదివి వినిపించేవారు. ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని  రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన  ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి. .. ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై!! . అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్పుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమున్ గ్ర కట శరత్కరేణు కర కంపిత జాలము శీత సాలమున్!! . అంటూ సంస్కృత స...

ఋణ గీత అను అప్పుల వేట !

Image
- ఋణ గీత అను అప్పుల వేట ! . సుమతి శతక కర్త అప్పిచ్చువాడు లేని వూళ్ళో వుండ వద్దన్నాడు.  ఏమి చిత్రమో గానీ మరీ యిదే కవి 'అప్పుగొని చేయు విభవము /తెప్పరమై కీడు తెచ్చుర సుమతీ అన్నాడు. మరి అప్పిచ్చే వాడిని వూర్లో పెట్టుకోవడం ఎందుకు? మళ్ళీ ఈ కవిగారే బంగారు కుదువ బెట్టకు అంగడిలో సరుకులు అరువు తేకు అన్నారు. ఈకాలం లో బంగారు కుదువ బెట్టకపోతే పిల్లాడిని చదివించడ మెలా?మధ్య తరగతి వారి బాధలు అర్థం చేసుకోవాలి మరి! "అర్థం చేసుకోరూ!" . 'అప్పులేనివాడే అధిక సంపన్నుండు' అంటాడు వేమన,  "తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును హాయి /అప్పు మెడ లో రాయి ఓ!కూనలమ్మా!అన్నారు ఆరుద్ర. మరి పింగళి నాగేంద్రరావు గారు "అప్పుచేసి పప్పుకూడు  తినరా ఓ!నరుడా/గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా' అని సూక్తి ముక్తావళి బోధించారు. ఎవరి మాట వినాలి? వున్నవారు లేనివారు రెండే రెండు జాతులురా / వున్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా" అన్నారు పింగళి వారు. అప్పుల అప్పారావు ఓ విరుగుడు చెప్పారు. ఐ.పి పెట్టిన వాడే వి.ఐ.పి జగాన" అప్పిచ్చిన వాడు మన బాగే కోరతాడన్నది పెద్...

సర్వసిద్ధికారకం!!

Image
                                  సర్వసిద్ధికారకం ప్రభో !.! - సర్వసిద్ధికారకం ప్రభో !.! ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,  తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.  లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.. నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,  ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.  ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో ! విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్. జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః .... .. (చిత్రం...వడ్డాది పాపయ్య గారు.)

బుద్దుండే ఆడదెవతీ సంతానం కోరుకోదు ''!!

Image
బుద్దుండే  ఆడదెవతీ సంతానం కోరుకోదు ''!! . ''మగవాడితో నిమిత్తం లేకుండా ఆడది  ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలదు; పిల్లలను కనడం తప్ప ,మరే పనైనా చేయగలదు. . ఇక పిల్లల విషయానికొస్తే -బుద్దుండే  ఆడదెవతీ సంతానం కోరుకోదు '' - మార్గరెట్ మిచ్చెల్...గాన్ విత్ ది విండ్ నుండి .

శుభరాత్రి - అమ్మడు ! .

Image
శుభరాత్రి - అమ్మడు !శుభరాత్రి ! . ఆమ్మాయే సన్నగ - అర నవ్వే నవ్వగా . మాతరం నటి చెప్పుకోండి చూద్దాం . . శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! .  శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! .  శుభరాత్రి - అమ్మడు ! . శుభరాత్రి - అమ్మడు ! . ఆమ్మాయే సన్నగ - అర నవ్వే నవ్వగా . మాతరం నటి చెప్పుకోండి చూద్దాం .

సినిమాల వాడ బెజవాడ ! -

Image
సినిమాల వాడ బెజవాడ ! - 1950s లో తమిళ్ మలయాళం డబ్బింగ్ సినిమాలు బాగా వచ్చేవి. తమిళ డబ్బింగు సినిమాలలో మంత్రికుమారి, సౌదామిని, మనోహర్ చాలబాగాఆడాయి. - మలయాళం డబ్బింగు సినిమాలలో ..తండ్రి, ఆకలి, కా ల చక్రం నాకు బాగానచ్చినవి. - హీరో లలో నజిరు.. తిక్కుర సి ...కాని సుకుమారి నాకు నచ్చిన హెరాయిన్ .. ఆమె ఇప్పుడు తల్లి పాత్రలలో కనిపిస్తుంది. - ఆకలి కరపత్రాలునాదేగ్గెరవంద కుఫైగాఉండేవి.... మాకు అప్పుడుఅవేగొప్ప... బెజవాడ ఈశ్వరమహల్ ,రామా టాకీసు ,దుర్గకళామందిరం.. లక్ష్మిటాకీసుచుట్టుతిరిగి ఫిమ్స్ముక్కలు ఎరుకోనేవాళ్ళం.. అదొకసరదా...హాల్దేగ్గెరవెళ్లిబయటనుంచి మాటలుపాటలువినేవాళ్ళం. ఆరోజులుమాకే కాదు ఎవ్వరికీరావు. . ఒకచిన్నవిషయం.ఒకరోజు దేవదాసు సినిమాచూసి 9 గంటలకు సత్యనారయణపురంలోమాఇంటికివస్తున్నాం. నేనుమాతమ్ముడు.. దారిలోఒకఊరకుక్కమమ్మల్ని ఆపేసిందిఒకఅరగంట...  మల్లి ఎవరోపెద్దవాళ్ళువస్తే వారితో కలసి దాటం.. అప్పుడునావయసు10 అనుకుంటాను.

కార్తిక పురాణం 11వ రోజు !

Image
                                   కార్తిక పురాణం 11వ రోజు -                        (మంధరుడు - పురాణ మహిమ.) ఓ జనక మాహారాజా! ఈ కార్తీక మాస వ్రత మహాత్మ్యం గురించి ఎన్ని ఉదాహరణలు చెప్పినా తనివితీరదు. ఈ మాసములో విష్ణువును అవిసెపూలతో పూజిస్తే చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు పూజ తర్వాత పురాణపఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీనికొక ఇతిహాసము చెప్తాను. శ్రద్ధగా ఆలకించమమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భోజనము చేస్తూ, మద్యపానీయాలకు అలవాటు పడ్డాడు. అంతే కాక తక్కువ జాతి వారితో స్నేహము వలన స్నాన, జప, దీపారాధన వంటి ఆచారాలను కూడా పాటించక దురాశాపరుడై ఉండెను. అతని భార్య మహా గుణవంతురాలు. శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుక్కోక సకల ఉపచారాలను చేస్తూ, పతివ్రతా ధర్మమును...

చాణక్య నీతి!

Image
- చాణక్య నీతి! . ఏకవృక్షసమారూఢా నానా వర్ణా విహఞ్గమాః | ప్రభాతే దశసు దిక్షు తత్ర కా పరివెదనా || - జీవితం లో నైనా ఇదే జరుగుతుంది! ఎవరెవరో ఎక్కడెక్కడ నుండియో వస్తారు . తమ పని తీరిపోతూనే ఎవరిదారి వారిదే! ఈ విషమై వాల్మీకి రామాయణములో ఈ విధముగా అంటాడు. యదా కాష్టంచ కాష్టంచ సమేయేతాం మహార్ణవే సమేత్యపి వ్యపేయేతాం కాలమసాధ్య కంచన ఒక పెద్ద వరదలో అటువైపునుండి ఒక దుంగ ఇటువైపునుండి ఒక దుంగ కలిసి కొంత దూరము పయనించుతాయి. కానీ ఆవి కాలమనే ఒరవడికి విడిపోతాయి. ఇది ప్రకృతి సహజము. పైగా ఇక కలవవు అని కూడా చెప్పలేము. లేక తప్పక కలుస్తాయి అనలేము. ఒకే చెట్టు పక్షులు ఎటు తిరిగినా రాత్రికి రావలసినదే కదా! చెట్టుకు కూడా ఆ సహనము కావాలి. మనకైనా పై విషయము అదే విధముగానే వర్తిస్తుంది. ఏవేవో కారణాలతో ఒకేచోట పోగైనవారు తమ అవసరము తీరగానే తమదారి తాముచూసుకొంటారు. వారు కృతజ్ఞత చూపలేదే అని మనము బాధపడితే కోరి రోగాలు కొనితెచ్చుకోవడమే! దానికంటే వారి రాకపోకలవల్ల మనకు వచ్చిందీ లేదు పోయిందీ లేదు అని ఊరకుంటే ఆరోగ్యము వుంటుంది ఆనందమూ వుంటుంది. ఆశ్రయించినవారికి అయినంతవరకు సమకూర్చు. కృతజ్ఞత చూపలేదని కృంగిపోవద్దు.

ఈశ్వరుని గుడి గోపురం.అరుణాచలం! -

Image
ఈశ్వరుని గుడి గోపురం.అరుణాచలం! - తేజో లింగము : అరుణాచలేశ్వర స్వామి - ఉమాదేవి , అరుణాచలం ( తిరువణ్ణామలై) ,తమిళనాడు . తమిళనాడులో (అరుణాచలం) తేజోలింగము ఉంది . ఈ స్వామి "అరుణాచలేశ్వర స్వామి"అని పిలుస్తారు. పార్వతీ దేవి ఇక్కడేతపస్సు చేసి, శివునికి అర్థ భాగమైనదని ప్రతీతి. ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి. మీదూరంలో ఉంది. విల్లు పురం నుంచి కాట్పాడికివెళ్లే మార్గంలో ఉంది . విల్లు పురం నుంచి 68కి. మీ . అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉన్నది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలే...

దేవదాసు-వేదాంతం!

Image
_ దేవదాసు-వేదాంతం! . అక్కినేని "దేవదాసు" విడుదలయిన రోజుల్లో అప్పటికి అంతగా విఖ్యాతి గాంచని శ్రీ ఆరుద్ర, శ్రీ శ్రీశ్రీ విజయవాడలో రిక్షాలో వెడుతూ ఆ పాటల లోని వేదాంతాన్ని గురించి చాలా సీరియస్ గా చర్చించుకుంటున్నారు. "కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! బహుదొడ్డ ప్రయోగం" ఆరుద్ర " దాంట్లో పెద్ద వేదాంతం దాగుందోయ్" అన్నారు శ్రీశ్రీ ఓ దమ్ములాగుతూ " జగమే మాయ అంటూ చాలా అర్ధం లాగారు" "అల పైడిబొమ్మ! చాలా బాగుంది" ఇంకో దమ్ముతో శ్రీశ్రీ "కొన్ని ప్రయోగాలు అర్ధం లేకుండా వాడారు" " తాగుబోతోడి మాటలకు అర్దాలేముంటాయి బాబు!" అన్నాడు రిక్షావాడు చర్చకు పుల్ స్టాప్ పెట్టాడు. . కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! అని రాయలేదుట .. కూడి (కలసి)ఎడమైతే(విడిపోతే ) పొరపాటు లేదు అని రాసేరు .. కాని ఘంటసాల వారు అలా పాడేరు... వేదాతం వారు తాగుబోతోడి మాటలకు అర్దాలేముంటాయి సర్దుకు పోయేరుట. .

అరుణ రేఖ కూచిభొట్ల గారి జోకు !

Image
- అరుణ రేఖ కూచిభొట్ల గారి జోకు. - ."పెళ్ళి చూపులలో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?" అడిగాడు శ్రీను. . "మీ మీసాలు, గంభీరమైన మొహం చూసి మీ రెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను!" అంది వాణి

కనక మహా లక్ష్మీ అదరహో!!

Image
- కనక మహా లక్ష్మీ అదరహో!! . అందాలె తొంగి చూసె.హాయి హాయి.. ఆనందం ఈలవేసే హాయిహాయి... సొగసు మెరిసే. వయసు విరిసే ..మనసుమురిసే.!

నరకాసురుడు !

Image
- నరకాసురుడు ! - నరకాసురుని తరచి చూస్తే… వ్యక్తిత్వానికి సంబంధించిన  చాలా సూచనలు కనిపిస్తాయి. నరకాసురుడు ఎవరో కాదు… విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామికీ, భూదేవికీ కలిగిన సంతానమే!  నరకాసురునికి బీజం సంధ్య వేళలో ఏర్పడిందట. పగలు- వెలుతురు, వేడి, జ్ఞానం, శక్తి… వంటి గొప్ప లక్షణాలకు ప్రతీక.  ఇక రాత్రేమో- చీకటి, నిద్ర, అజ్ఞానం, కామం… వంటి దుర్లక్షణాలకు ప్రతినిధి.  మంచి లక్షణాలు ఎన్ని ఉన్నా కూడా, ఒక్క దుర్లక్షణం ఉంటే చాలు… ఆ మనిషి నాశనం అయిపోతాడు.  రావణాసురుడు జ్ఞాని అయినప్పటికీ అహంకారంతో ఓడిపోయాడు. మహిషాసురుడు బలవంతుడు అయినప్పటికీ మదం వల్ల నశించిపోయాడు. నరకాసురునిలో కూడా మంచిని తుంచే చెడు లక్షణాలు ఉన్నాయని సూచించడానికి అతను సంధ్యవేళలో రూపాన్ని ధరించాడు అని చెబుతారు. దేవుని కుమారుడు అయినప్పటికీ… తమ కుమారుడైనప్పటికీ నరకాసురునిలో అసుర లక్షణాలు ఉన్నాయని గ్రహించారు ఆ దంపతులు. లోక కళ్యాణం కోసం అలాంటివాడిని సాక్షాత్తూ విష్ణుమూర్తే చంపేస్తాడని భయపడింది భూదేవి. ఆ భయానికి ఆమెలోని తల్లిమనసు తల్లడిల్లింది. దాంతో `ఏ ఒక్కరివల్లా తన కొడుకు చనిపోకూడ`దన్న వరా...

అసామాన్యుడు విశ్వనాథ!!

Image
అసామాన్యుడు విశ్వనాథ!! - అందరూ ప్రయాణించే దారిలో ప్రయాణం చాలా సులభం.  కొత్తదారి కనుక్కోవటం చాలా కష్టం . కానీ,  పాత దారిలో ప్రయాణిస్తూ,ఆ దారిని  కొత్త పుంతలు తొక్కించటం సామాన్యులకు సాధ్యమ్ కాదు.  అలాంటి అసామాన్యుడు విశ్వనాథ. . ఆయనను కుల తత్వ వాది అనేవారెందరో  అనేక సందర్భాలలో ఇతర కులాల పైన ద్వెఅశాన్ని, తక్కువ కులాలవారి పైన చులకనను,  స్వకులం వారి పైన ప్రేమను బహిరంగంగా చూపారు. అయితే, విశ్వనాథ వైపు వేలు చూపించి, ద్రుశ్టిని తమ వైపు నుంచి మళ్ళించుకున్నారు. . మన దేశం లో కుల భావనకు అతీతంగా ఎవ్వరూ లేరు.  కానీ, అందరో విశ్వనాథ వారి వల్ల తమ నేరాన్ని కప్పిపుచ్చుకో గలుగుతున్నారు. చివరికి, జాశువా కూడా, మతం మారినా కులం మారలేదని వాపోయాడు.  క్రీస్తును ఆశ్రయించినా, మాలా క్రీస్తు వేరు, మాదిగ క్రీస్తు వేరు అని  ఖండికలు రాసి, వేదనను వెళ్ళ గ్రక్కుకున్నాడు.

నాగేంద్రుడు !

Image
నాగేంద్రుడు ! - శివకేశవుల అనుగ్రహాన్ని పొందిన నాగేంద్రుడు ... మానవాళిచే దైవంగా భావించబడుతున్నాడు. కొన్ని శైవ క్షేత్రాల్లోను ... మరి కొన్ని వైష్ణవ క్షేత్రాల్లోను ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో నాగేంద్రుడు ఉపాలయంగా కాకుండా ప్రధాన దైవంగా కూడా కనిపిస్తుంటాడు.

ప్రాణస్నేహితులు. !

Image
- ప్రాణస్నేహితులు. ! . హలో ! హలో !! ఎవరూ ! నేనంరా ! తమ్ముడు ! ఆ ! అన్నయ్యా చెప్పు ! ఏం ! లేదురా ! నాకు ఫేస్బుక్ కావలిరా ? ఫేస్భుక్కా ? అకౌంటు ఓపెన్ చెస్తే సరిపోతుందిగా ? అకౌంటు ఓపెన్ చెయ్యటం నాకు చేతకాదుగా ! నేను చదువుకోలేదుగా ! అయినా నీకు ఫేస్భుక్ ఎందుకూ ? ఏం లేదురా ! మొన్న బస్లో వస్తుంటే, ఓ అమ్మాయి తన ఫేస్బుక్ ఐడీ ఇచ్చి, చాట్ చేద్దాం రా అన్నది. ! అలానా ! అయితే ఓ వెయ్యి రూపాయలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో పంపు ! అంతేనా ! ఒరేయ్! ఇప్పుడే పంపుతా ! అర్జెంటుగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చెయ్యరా ! వెయ్యి రూపాయలేంట్రా ! పన్నెండొందలు పంపుతా ! నాకు ఫేస్భుక్ కావల్రా అర్జంటుగా ! అరేయ్ ! దానికి చాలా ప్రాసెస్ ఉందిరా ? నువ్వనుకున్నంత వీజీ కాదు ! అలాగా ! ఇప్పుడే ఒకడు ఫేస్భుక్ అమ్మేత్తానన్నాడు. ఆడేంట్రా ఐదొందలకే ఫేస్భుక్ అమ్మేత్తానంటాడు " ఒరెయ్ నువ్విలా అందరినీ నమ్మేయ్యబాక ! మోసపోతావ్ ! నేను నీకు అంత అర్జంటయితే నా ఫేస్భుక్ ట్రాన్సఫర్ చేసేస్తా ? అలాగే ! అయితే నా తమ్ముడి చేత పంపిత్తా వెయ్యిరూపాయలు, ఆధార్ కార్డు, ఫొటో అలా వద్దు. అర్జంటు అంటున్నావుగా ...

నీకున్,మాంసమువాంఛయేని కరవా!

Image
శ్రీ కాళహస్తీశ్వరశతకము... .... నీకున్,మాంసమువాంఛయేని కరవా! / నీచేత లేడుండగా జొకైనట్టి కుఠారముండ ననల / జ్యోతుండ నీరుండగా పాకంబొప్పఘటించి చేతిపునుకన్ / భక్షింప కాబోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా / శ్రీకాళహస్తీశ్వరా! ..... శ్రీకాళహస్తీశ్వరా!  నీకు మాంసమును తినవలెనని కోరిక ఉన్నచో జింక ఉన్నది. పదునైన కత్తి ఉన్నది.నీ కంటిలో అగ్ని యున్నది. శిరస్సుపై గంగ చేతియందు నీళ్ళు ఉన్నవి. వాని అన్నింటితో వండుకొని,నీ పుఱ్ఱెయగు భిక్షా పాత్ర యందు  పెట్టుకొని తినవచ్చును గదా! ఆ బోయవాడైన తిన్నడు పెట్టిన ఎంగిలి మాంసము  తినుట న్యాయము గాదు!  అనగా నీ భక్తులు ఇచ్చినది దేనినైనను స్వీకరించెదవు కదా.

శివ స్తుతి!!

Image
- శివ స్తుతి!! - చిదానంద రూపం త్రినేత్రాభిరామం సదా లోకరక్షం పరం వేదసారం! సదాకారమేకం సదానందరూపం సదా భక్తపాలం హృదా భావయామి!! -

కార్తీక పురాణం 10వ రోజు !

Image
- కార్తీక పురాణం 10వ రోజు - ద్వాదశీ ప్రశంస   మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కార...

శుభరాత్రి -సౌందర్య లహరి! **** 3****

Image
- శుభరాత్రి -సౌందర్య లహరి! * సౌందర్యలహరి శ్రీ శంకర భగవత్పాద విరచితము. ఇది 100 శ్లోకములతో కూడిన దేవీ స్తుతి గ్రంథము. పరబ్రహ్మ తత్త్వాన్ని 'శాంతం, శివం, సుందరం' అని పేర్కొంటాము. ఆ పరతత్త్వం, తత్స్వరూప సౌందర్య స్వభావ ప్రవర్తనాలు మానవాకృతిని దాల్చి, స్త్రీమూర్తిగా అభివ్యక్తమైతే ఎలావుంటుందో ఈ గ్రంథంలో అత్యంత మనోజ్ఞంగా వర్ణింపబడి ఉన్నవి. అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మంను సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమయ్యే అక్షరమాలారత్నం ఈ గ్రంథం. శ్లోకాలన్నీ మృదుమధుర గంభీరాలై, ప్రసాదసౌకుమార్యాలై వెలయుచు, భక్తిశ్రద్ధలతో చదివే దేవీభక్తులకు అనిర్వాచ్యమైన మనశ్శాంతిని కలుగజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ గ్రంథంలో దేవీ సౌందర్యం, స్వరూప - సంస్థితి - గుణ - చేష్టా - ప్రభావ - తత్త్వసౌందర్యాల - స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ భేదాలతో అత్యంత మనోహరంగా వర్ణించటం వలన శ్రీ శంకర భగవత్పాద విరచిత ఈ దేవీస్తుతికి సౌందర్యలహరి అనే నామకరణం ఎంతో సముచితంగా ఉంది. ఈ దేవియే యోగమాయ. ఆదిశక్తి ఐన ఈ తల్లి దుర్గాది శక్తిరూపాలను పొంది ఈ కలియుగంలో సర్వత్రా పూజలందుకుంటున్నది. ఆదిపరాశక్తియే ప్రతిగ్రామంలోనూ గ్రామశ...

జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.)

Image
జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.) . జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను, ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు. . ఇది మెరుపు లేని మబ్బు ఇది తెరిపి లేను ముసురు  ఇది ఎంతకీ తగ్గని ఎండ ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి ఇది గ్రీష్మం  ఇది శిశిరం ఇది దగ్ధం చేసే దావానలం . ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం ఒక్కటి ఒక్కటే సుమండీ ఒక్క జ రీ అం చు తె ల్ల చీ ర విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ,  పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి. అలాగే మరి కొన్ని వ్యాక్యాలు.. ఆశ కొరిక పెద వాడి ను౦చి దనిక... రాజు.. ఆడ.. మెగ .. అ౦దరు ఆ చితిలొ పడి కాలిపొయారు ఎ౦దరిజీవితాలను తగుల పెట్టారు పెడుతున్నార...

శకుంతల మదన లేఖ !

Image
- శకుంతల మదన లేఖ ! (మహా కవి కాళిదాసు--- చిత్రం -రాజ రవి వర్మ.)  . శకుంతల విరహం లో వుండగా ,.శకుంతల మనో గోప్యాన్ని ”మదన లేఖ ”లో వ్రాసి, దేవతా ప్రసాదం గా దుష్యంతునికి అంద జేస్తే బాగుంటుంది అని చక్కని సలహా నిచ్చింది ఆమె ఇష్ట సఖి ప్రియంవద. ”నీ సలహాను కాదన గలనా ?”అంది శకుంతల .అయితే లేఖ ,ఏ విధం గా ఉండాలో కూడా ప్రియంవదే చెప్పేసింది .”నీ వేదన ,అనురాగ తాపాలు ,చదవ గానే మనసుకు హత్తు కోనేట్లు ,లలిత పద బంధం తో లేఖను రాయి  .”అని సూచించింది . . మళ్ళీ ప్రియంవదే ”ఆత్మ గుణావ మానినీ !శరీరానికి చల్లదనం సౌఖ్యం చేకూర్చే శరజ్యోత్స్న ను చేలాన్చలం తో నివారించే వారుంటారా” ?అన్నది .సంబోధన లోనే శకుంతల గుణాదిక్యం ,దానిపై ఆమె కున నమ్మకం వ్యక్తమవుతుంది ”.దుష్యంతుడు తప్పక వలచి తీరతాడు .నీ గుణాదిక్యత కు    ముగ్ధులు కాని వారెవ్వరు ?ఆభి జాత్యం గల, సుకు మారివి .నిన్ను తప్పక స్వీకరిస్తాడు .సందేహం వద్దు .”అని ఖచ్చితం గా చెప్పింది  .. మన్మధ లేఖ కు కావలసిన సామగ్రిని ప్రియంవదే సిద్ధం చేసింది .”సుకోదర సుకుమారమైన నళిన  పత్రం పై నఖాలతో వర్ణాలు రాయి ‘అని హితవు పల్కింది .అందులో ప...

మన వాడికి . ఆడ వాసన అసలు పడదు!

Image
               మన వాడికి . ఆడ వాసన అసలు పడదు!

ఆ కిక్కే వేరు.

Image
- - ఇలా పుల్లల పొయ్యిమీద చిలకడదుంపలు పెట్టి కాల్చుకుతింటే ఆ కిక్కే వేరు. - చిన్నప్పుడు వేణ్ణీళ్ళ పొయ్యిలో చిలగడ దుంపలు కాల్చుకు తినేవాళ్ళం. వేరుసెనక్కాయలు కూడా.  - ఈ బొమ్మ క్రెడిట్ అంతా... ఇది ఫోటో కాదంటే నమ్మలేనంత బాగా వేసిన ఆ పెయింటర్ దే.

శ్రీకాళహస్తీశ్వరశతకం ........ధూర్జటి .

Image
-                     శ్రీకాళహస్తీశ్వరశతకం ........ధూర్జటి . . నిను సేవింపగ నాపద ల్బొడమనీ నిత్యోత్సవంబబ్బనీ జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానము గల్గనీగ్రహగాతుల్ కుందింపనీ మేలువ చ్చిన రానీ యని నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా  - అర్ధం-సుఖాలు ఇచ్చేది భగవంతుడైనప్పుడు,కష్టాలనిచ్చేది కూడా భగవంతుడే! సుఖాలు అనుభవించేటప్పుడు మనిషి అదంతా తన ప్రతిభ వల్లనే అనుభవిస్తున్నాని భావిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు,తనకు కాలం కలసి రాలేదని అంటాడు.గ్రహరీతులు బాగాలేవని అంటుంటాడు. . కష్టసుఖాలు విడదీయలేనివి.రెండూ కలసే ఉంటాయి. సుఖాలు అనుభవించటం వల్ల చాలా కష్టాలు రావచ్చు. కష్టాలు అనుభవించిన తరువాత సుఖాలు పొందవచ్చు