వేణువు- శ్రీ కృష్ణ భగవాన్!








-

వేణువు- శ్రీ కృష్ణ భగవాన్!

.

ఒక బృందావనం ..... సోయగం

ఒకే స్వరం సాగేను తీయగా

ఒకే సుఖం విరిసేను హాయిగా

.

ఈ బృందావనసౌందర్యాన్ని చూస్తుంటే హరికథా పితామహులు 

కీ.శే. ఆదిభట్ల నారాయణ దాసు గారి గీతం లోని ఒక చమత్కారం గుర్తొచ్చింది. ఆయన గీతం లో "శ్రీకృష్ణుడు వేణువుని ఊదుతుంటే ప్రకృతి అంతా పరవశించిందనీ, ఎండి పోయిన , వాడి పోయిన తరులతలన్నీ మళ్లీ చిగిర్చాయనీ వ్రాశారట. 

అది విన్న ఒక పండితుడు " మీరు మరీ అతిశయోక్తి చెప్పారండీ ! అన్నీ చిగురిస్తే ఆయన మూతికి ఆనిన వేణువు కూడా చిగుర్చాలి కదా - 

అదెందుకు చిగుర్చ లేదు ? అన్నాడట. 

దానికి మహా పండితులైన నారాయణ దాసు గారు తడుముకోకుండా

"అయ్యా ! ఆ వేణువు కృష్ణ భగవానుని నోటికి తాకగానే 

దానికి జన్మరాహిత్యమే కలిగింది. ఇక చిగుర్చటం దేనికి ! "అన్నారట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!