ఇదికో ఇలా కూడా ఉంటారు -కొందరు మిత్రులు !

 -

ఇదికో ఇలా కూడా ఉంటారు -కొందరు మిత్రులు !

.

" నేను ఫేస్ బుక్ లో ఫిబ్రవరి 2015 నుండి ఉన్నాను. నా "స్నేహితురాళ్ళకి స్నేహితురాలు" నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది .

" నేనూ యాక్సప్ట్ చేయకుండా కొన్ని ప్రశ్నలు ఇన్బాక్స్ లో అడిగాను. దాంతో ఆమె ఠారెత్తిపోయి నాకు అక్షింతలు వేసి "నో ఐ కాన్ట్ యాక్సప్ట్ "అని మెసేజ్ పెట్టింది.

ఇంతకీ ఏమా యక్ష ప్రశ్నలు !!!! ఏమా కథా !! అంటే చిత్తం చెబుతాను !!!!!!"

తను: "హై !!!"

నేను: "హై మీ ఫ్రెండ్ రిక్వస్ట్ యాక్సప్ట్ చేస్తాను కానీ ఓ విషయం మీరు ఆడా??? మగా ??? ఎందుకంటే మీ ఫ్రొఫైల్ పిక్ లో ఫోటో లేదు !!! నేను అబ్బాయిల ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సప్ట్ చేయను ఎందుకంటే అమ్మాయిల పేరుతో అబ్బాయిలు కూడా ఫేస్బుక్ లో ఉంటారు( ఆమె బృందావనం/ గార్డన్ ఫ్రొఫైల్ పిక్ పెట్టుకుంది)"

ఆమె: "ఆడదాన్నే !!!!"

నేను : "మీపోస్ట్లో నన్ను ట్యాగ్ చేయకూడదు"

ఆమె: "సరే"

నేను: " నేను క్యాండి క్రస్ట్ గేమ్సు మరియు క్రిమినల్ కేసులు ఆడను పైగా నాకు ఆడడం రాదు కూడా !!!"

ఆమె:" సరే"

నేను : " నేను చస్తే చాట్ చేయను ఇప్పుడు కూడా ఇవ్వన్నీ చెప్పేందుకే ఇన్బాక్స్ లో కొచ్చాను "

ఆమె: "సరే "

నేను : నా టైమ్లైన్ లో మీరు ఏ పోస్ట్లు పెట్టకూడదు "

ఆమె: సారీ !!! నేను నా ఫ్రెండ్ రిక్వస్ట్ క్యాన్సల్ చేస్తున్నాను " నేను 45 ఏళ్ళ మిడిల్ ఏజ్ ఉమన్ ని ఒకరి గురించి తెలీకుండా ఇన్ని అనుమానాలతో స్నేహం చేయడం ఎందుకు ???? "

నేను: " సరే"

"ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను !!! "

" ఈ పై సమస్యలన్నీ నా స్నేహితురాళ్ళ పాట్లు నేనూ అలా అష్టకష్టాలు పడకూడదనే ఈ ప్రశ్నలు అడిగి అక్షింతలు వేయించుకున్నాను. "

"

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!