శివుని రూపం !


-

శివుని రూపం !

.

పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది.

శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. 

ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. 

అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, 

గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. 

అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, 

ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, 

ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని,

భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. 

ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, 

నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు,

మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.

రెండు స్వరూపాలు!

శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. 

శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. ఆవి రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే 

.

-శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. 

ఇలా మనం జగ్రత్తగా పరిశిలిస్తే మహదేవుణ్ణి రెండు రుపాలలో గమనిస్తాము.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!