శకుంతల మదన లేఖ !

-

శకుంతల మదన లేఖ !

(మహా కవి కాళిదాసు--- చిత్రం -రాజ రవి వర్మ.) 

.

శకుంతల విరహం లో వుండగా ,.శకుంతల మనో గోప్యాన్ని ”మదన లేఖ ”లో వ్రాసి, దేవతా ప్రసాదం గా దుష్యంతునికి అంద జేస్తే బాగుంటుంది అని చక్కని సలహా నిచ్చింది ఆమె ఇష్ట సఖి ప్రియంవద.

”నీ సలహాను కాదన గలనా ?”అంది శకుంతల .అయితే లేఖ ,ఏ విధం గా ఉండాలో కూడా ప్రియంవదే చెప్పేసింది .”నీ వేదన ,అనురాగ తాపాలు ,చదవ గానే మనసుకు హత్తు కోనేట్లు ,లలిత పద బంధం తో లేఖను రాయి  .”అని సూచించింది .

.

మళ్ళీ ప్రియంవదే ”ఆత్మ గుణావ మానినీ !శరీరానికి చల్లదనం సౌఖ్యం చేకూర్చే శరజ్యోత్స్న ను చేలాన్చలం తో నివారించే వారుంటారా” ?అన్నది .సంబోధన లోనే శకుంతల గుణాదిక్యం ,దానిపై ఆమె కున నమ్మకం వ్యక్తమవుతుంది ”.దుష్యంతుడు తప్పక వలచి తీరతాడు .నీ గుణాదిక్యత కు    ముగ్ధులు కాని వారెవ్వరు ?ఆభి జాత్యం గల, సుకు మారివి .నిన్ను తప్పక స్వీకరిస్తాడు .సందేహం వద్దు .”అని ఖచ్చితం గా చెప్పింది 

..

మన్మధ లేఖ కు కావలసిన సామగ్రిని ప్రియంవదే సిద్ధం చేసింది .”సుకోదర సుకుమారమైన నళిన  పత్రం పై నఖాలతో వర్ణాలు రాయి ‘అని హితవు పల్కింది .అందులో ప్రసాదాన్ని వుంచి ,పొట్లం లాగా మడిచి రాజుకు ఇవ్వ వచ్చు అని చెప్పింది 

.రాజు అక్కడికే వస్తాడు .ప్రియంవద నెమ్మది గా అంటుంది ”మీ ఇరువురి అన్యోన్య అను రాగం ప్రత్యక్షం అయాయి .అయినా మాచేలి యందలి ఆత్మీయత చేత నేను మళ్ళీ చెబుతున్నాను ”అని రాజ ధర్మాన్ని ,ఆయనకు గుర్తు చేసింది .

ఆర్తి లో వున్న వారి ఆర్తి పోగొట్టటం రాజ ధర్మమే కదా అని భావం ”మా ప్రియ సఖి మన్మధ బారి పడింది .ఆమె ప్రాణం నిలప టానికి మీరే అర్హులు ”చాలా చిన్న చిన్న మాటలే .అందులో దుష్యంతుని పై శాకున్తలకున్న అవ్యాజ మైన ప్రేమను వ్యక్త పరుస్తూ మనమ్ధుని పీడా నుంచి ఆమెను కాపాడమనీ ,ఆమె చాలా కృశించి పోయి ఉందనీ ,ప్రాణాలు మాత్రమే నిలిచి ఉన్నాయనీ జ్ఞాపకం చేసిందన్న మాట .ఆమె ప్రాణం కాపాడటానికి అతడే సమర్ధుడు అని నిర్ద్వంద్వం గా చెప్పేసింది .ఇక్కడే ప్రియంవద నేర్పరి తనం మరో సారి కాళిదాసు మనకు వ్యక్తం చేశాడు .

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!