మహా శివుడు.!


-

మహా శివుడు !

.

శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. 

శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు.

శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. 

శివుడు అనార్య దేవుడు. కానీ తరువాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.

.

శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని యొక్క అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు.

వైష్ణవంలో శివుని విష్ణువు యొక్క రూపముగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు.

శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు..

.

శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు

(ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు) మరియు రూపాతీతుడు.-

ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.

.

శివుడు జననమరణాలుకు అతీతుడు.కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే ఆందరు దేవతలు శివారదకులే.విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు సదా శివలింగారదన చేస్తుంటారు.పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.అందుకే పరమశివుడు అంటారు.

.

మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది.

మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. 

అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉంది.

(వికిపిడియా నుండి.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!