ఋణ గీత అను అప్పుల వేట !

-


ఋణ గీత అను అప్పుల వేట !

.

సుమతి శతక కర్త అప్పిచ్చువాడు లేని వూళ్ళో వుండ వద్దన్నాడు. 

ఏమి చిత్రమో గానీ మరీ యిదే కవి 'అప్పుగొని చేయు విభవము /తెప్పరమై కీడు తెచ్చుర సుమతీ అన్నాడు.

మరి అప్పిచ్చే వాడిని వూర్లో పెట్టుకోవడం ఎందుకు?

మళ్ళీ ఈ కవిగారే బంగారు కుదువ బెట్టకు అంగడిలో సరుకులు అరువు తేకు అన్నారు.

ఈకాలం లో బంగారు కుదువ బెట్టకపోతే పిల్లాడిని చదివించడ మెలా?మధ్య తరగతి వారి బాధలు అర్థం చేసుకోవాలి మరి! "అర్థం చేసుకోరూ!"

.

'అప్పులేనివాడే అధిక సంపన్నుండు' అంటాడు వేమన, 

"తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును హాయి /అప్పు మెడ లో రాయి ఓ!కూనలమ్మా!అన్నారు ఆరుద్ర.

మరి పింగళి నాగేంద్రరావు గారు "అప్పుచేసి పప్పుకూడు 

తినరా ఓ!నరుడా/గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా' అని సూక్తి ముక్తావళి బోధించారు.

ఎవరి మాట వినాలి?

వున్నవారు లేనివారు రెండే రెండు జాతులురా / వున్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా"

అన్నారు పింగళి వారు.

అప్పుల అప్పారావు ఓ విరుగుడు చెప్పారు.

ఐ.పి పెట్టిన వాడే వి.ఐ.పి జగాన" అప్పిచ్చిన వాడు మన బాగే కోరతాడన్నది పెద్దల వాక్యం 

'అప్పిచ్చిచూడు ఆడపిల్లనిచ్చి చూడు' అన్నట్టు 

ఎవరి కష్టాలు వాళ్ళవి.అప్పులుచేయడం లో మనకు ఆదర్శం మన వెంకన్న బాబు, మరియు మన ప్రభుత్వ.మే కదా!

.

'ఋణానంద లహరి'.వ్రాసిన ముళ్ళపూడి వారికి నమస్కరిస్తే 

"నీకు అడగ్గానే అప్పుదొరకా" అని ఆశీర్వ దిస్తారట.

ఇంతకీ అప్పు నిప్పా?పప్పా?ఏమో ఒకటి మాత్రం నిజం

'అప్పు ఆరు తెన్నులు ముప్పు మూడు తెన్నులు' ఆ తరువాత తీసుకున్న వాళ్ళ తలరాత.

"అప్పుతీసుకున్నవాడే అధిక సంపన్నుండు' అంటాడు ఆధునిక కవి.ఎందుకు కాడు.

అప్పు చేసి తెచ్చిన డబ్బు వడ్డీలకు తిప్పితే అధిక సంపన్నుడు కాడా?అప్పుచేసి కారు కొనరా ఓ! నరుడా! యిదే కలికాలపు తీరురా నరుడా! 

ఏదో తమాషాకు కాసేపు నవ్వుకుందామని వ్రాశాను.అప్పుచేయకండి.

అయినా నేను చెప్తే మానేస్తారా ఏమిటి?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!