-
సంగమేశ్వరం!
.
సంగమేశ్వరం, కర్నూలు జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామము.ఇక్కడ ప్రసిద్ధ శివుని ఆలయము ఉంది..
అది కృష్ణాతీరం. ఆ కృష్ణలో తుంగభద్రతో సహా ఐదు నదులు కృష్ణలో కలుస్తున్నాయి. అందువల్ల అక్కడ నది లోతుగా, వేగంగా ప్రవహిస్తోంది. ఇది నివాసానికి అనువైన ప్రదేశం.
-సంగమేశ్వరానికి చెందిన ఆలయ ద్వారం!
ఏటి వొడ్డున ధర్మరాజు ప్రతిష్టితమైన శివాలయం ఒకటి వుంది. గురుడు కన్యారాశిలోకి ప్రవేశించినపుడు అక్కడ చాలామంది ప్రజలు వచ్చి కృష్ణా పుష్కరాల యాత్ర చేసుకుని వెళ్తున్నారు. సకల పాపాలను నివృత్తి చేసే ప్రదేశం కనుక ఈ త్రివేణి సంగమానికి నివృత్తి సంగమం (సంగెం) అనే పేరు వచ్చింది. దారిలో శిథిలమైన కోటలున్నాయి. అవి పాండవులు తమ అరణ్యవాస కాలంలో నిర్మించుకున్నారని స్థానికులు చెప్పారు .
.
ఈ గ్రామానికి నివృత్తి సంగం, నివృత్తి సంగమం వంటి పేర్లు కూడా ఉండేవి. 1830లో కాశీయాత్రచరిత్రలో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని నివృత్తి సంగం అని ప్రస్తావించారు.
Comments
Post a Comment