గాంధర్వ గానం’!

-

‘గాంధర్వ గానం’!

-

మనసుపెట్టి వినాలే కాని, సృష్టి అంతా నాదమయం!

ప్రతి ధ్వని నుంచి మనకు ‘ఓంకారం’ వినిపిస్తుంది. 

సంగీతానికి ప్రణవమే మూలం. 

అందుకే ‘నేను వేదాల్లో సామవేదాన్ని’ అంటాడు కృష్ణపరమాత్మ. ఆ సామవేదం నుంచే గానం ఆవిర్భవించింది.

.

మొదట గంధర్వులు అభ్యసించడం వల్ల ‘గాంధర్వ గానం’ అనే పేరు వచ్చింది.

చదువుల తల్లి సరస్వతి వీణ పేరు ‘కచ్ఛపి’. ఆ వీణాతంత్రుల నుంచి స్వరాలు వరాలై కురుస్తాయి..

.

మనసుకు, మస్తిష్కానికి- సంగీతమే షడ్రసోపేతమైన విందు భోజనం. మానవ శరీరంలోని నరాల వ్యవస్థను స్పందింపజేసి, చైతన్యం కలిగించే దివ్య ఔషధం అది. శ్రవణ సుందరమైన స్వర పరిపక్వతతో బ్రహ్మీ ముహూర్తంలో చేసే సంకీర్తనం మహావిష్ణువు వీనులకు విందుగా మారుతుందని భక్తులు విశ్వసిస్తారు.

-

భారతీయ శాస్త్రీయ సంగీతానికి పలు ఔషధ గుణాలున్నాయి. జలధిని దాటించే నావ- సంగీతం! అనిర్వచనీయమైన రసానుభూతిని అది కలిగిస్తుంది. భజన, సంకీర్తన, పారాయణం, కచేరి, నృత్యం, నాటకం, హరికథ, యక్షగానం, బుర్రకథ వంటి పాయలుగా చీలి, ఆధ్యాత్మిక సుధా స్రవంతిలా అది ప్రవహిస్తుంది..

.

ముముక్షువుల మోక్ష లక్ష్యసాధనకు సంగీతమే ఉపకరణం. భాష, ప్రాంతం, వర్గం, మతం వంటి ఎల్లలు, హద్దులు సంగీతానికి ఉండవు. ఆ కళ విశ్వజనీనం, సార్వకాలీనం. అన్ని కళల్లోకీ సంగీతమే ఉత్కృష్టమైనది. భక్తి సమన్వితమైన సంగీతామృత సాగరంలో ఓలలాడే ప్రతి జన్మా ధన్యమైనట్లే!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!