ప్రేమకథలు- మెట్లవరుసలు.!

ప్రేమకథలు- మెట్లవరుసలు.!

(శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు .)

గగనసీమలు కాలపరిధులు

గడచిపోయే మెట్లవరుసలు

జీవితమునకు మరణమునకూ

ఈవలావల కదలు వరుసలు

కుడిఎడమలే కానరాని

తుదిమొదళ్ళే తోచబోని –మెట్లవరుసలు

స్వప్నమధువుల జడులలోపల

స్వాంతమున జ్ఞాపకపు పొరలు

పొరలలోపల తెరలు తెరలుగ

పూర్వజన్మల ప్రేమకథలు- మెట్లవరుసలు..

– కృష్ణశాస్త్రి గారి ‘ జమీందారీ బద్ధకం ‘ కారణం గా పాటలు

అందించలేకపోతే రజనిగారు రాసేసేవారుఅని మా బాబయ్య 

వింజమూరి శివ రామారావు .

అటు వంటిదే ఈ పాట అని విన్నాను

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!