-దశావతార స్తుతి:-6.- (పరశురామావతారం .)

-దశావతార స్తుతి:-6.-

(పరశురామావతారం .)

"క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూర్తే

భూగుకులరామ పరేవ నమో భక్తం తే పరిపాలయమాం

నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!


-

మానవులకు తల్లికంటే తండ్రే శ్రేష్ఠమైన దైవమని 

(పితాపరం దైవతం మానవానం) పరాశరగీత (297-2) తెలిపిన సూక్ష్మధర్మాన్ని పరశురాముడు రుజువు చేశాడు.

ఒకసారి రేణుక నదీజలాన్ని తేవడానికి వెళ్ళింది. అక్కడ అప్సరసలతో క్రీడించే గంధర్వరాజును చూసి, వానిపై రేణుకకు కొంచెం స్పృహ కలిగింది. ఆలస్యంగా వచ్చిన ఆమె మనసును జమదగ్ని గ్రహించి, ఆగ్రహించి, ఆమెను వధించమని తమ కుమారులను ఆజ్ఞాపించాడు. అన్నలెవరూ తల్లిని వధించలేదు కనుక పరశురాముణ్ణీ వరం కోరుకోమ్మంటే – తల్లి, అన్నలపై ఎలాంటి ద్వేషం లేనందువల్ల వారిని తిరిగి బతికించమన్నాడు! అందుకే వారు మళ్ళీ బతికారు – భాగ. (9-16-8)


పరశురాముడు అవతారపురుషుడైనా అతణ్ణి ఓడించిన సందర్భం ఒకటుంది. శివధనస్సు విరిచి, వివాహితుడై సీతాదేవితో వచ్చే దశరథరాముణ్ణి ఎదిరించి పరశురాముడు భంగపడ్డాడు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!