ఆవు-పులి కథ! (ముళ్ళపూడి ముగింపు)

ఆవు-పులి కథ!

(ముళ్ళపూడి ముగింపు)

-

ఒక ఊళ్ళో ఒక ఆవుకు ఒక ఎదిగిన పిల్ల వుండేది, 

ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగ బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది, పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆ జంతువు ను చూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి పైకి దూకబోయింది, ఇది గమనించిన అది ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు..నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది.


ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది, ఒహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా, చాలా ఆకలిమీదున్నాను నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తా ననుకున్నావా. అయ్యో! పులి రాజ నన్ను నమ్ము నేనెప్పుడూ అసత్యమాడలేదు, నువ్వుదయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను, నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఏల ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్య కార్యముందా నన్ను నమ్ము.అది కాక మా అమ్మమ్మ పుణ్య కోటి అనే అవును

మీ తాత గారు ఈవిధముగా వెన్నకి పంపినారు , ఆ కధ మీకుతెలియదా అనెను .


అప్పుడు పులి ' నిజమే, మా తాత చెప్పేరు . నువ్వు కూడా తిరిగి సరే వెల్లు కాని మళ్ళీ తిరిగిరాకపోయావో ఈ రోజుకాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు అప్పుడు చెపుతా నీ సంగతి అంది.అంతమాటలకే సంతోషించిన ఆవు పరుగున పోయెను.


పులి ఆ వు కోసంచూచు చుండెను .ఇంతలో ఒక నక్క వచ్చి 

ఏమి పులి రా జాఎవ్వరికీ కోసం ఎదురు చూస్తున్నారు అనెను .


అప్పుడు పులి తన కధ చెప్పెను.

అప్పుడు నక్క పగల బడి నవ్వి, ఆ ఆవును నేనూచూసాను ,

అది ఆవు కాదు , ఎద్దు ...మిమల్ని మోసం చేసింది అని చెప్పెను .


(ముళ్ళపూడి వారి కధ )


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!