తెలుగే వెలుగు!!

తెలుగే వెలుగు!!

-


గోర౦త దీప౦ – కొ౦డ౦త వెలుగు

ఇ౦టి౦టి తెలుగు – ఇ౦టి ఇళ్ళాళ్ళకే వెలుగు

తెలుగులో పలికితే – జాతికే వెలుగు

తెలుగులో బోధన – పాఠశాలకే వెలుగు

తెలుగులో పాఠాలు – విద్యార్ధులకే వెలుగు

తెలుగులో క౦ప్యూటర్లు – యువతరానికే వెలుగు

తెలుగులో ప౦డుగలు – స౦ప్రదాయానికే వెలుగు

తెలుగులో ఆటపాటలు – స౦స్కృతికే వెలుగు

తెలుగులో ప్రార్థన – అర్థమయిన భక్తునికే వెలుగు

తెలుగులో జీవన౦ – తెలుగుదనానికే వెలుగు

తెలుగులో స్వాగత౦ – ఊరుకే వెలుగు

తెలుగులో ఊర్ల పేర్లు – ప్రయాణీకులకే వెలుగు

తెలుగులో పెళ్ళిళ్ళు – కాపురాలకే వెలుగు

తెలుగులో చట్టాలు – న్యాయవాదులకే వెలుగు

తెలుగులో తీర్పులు – న్యాయ స్థానానికే వెలుగు

తెలుగులో వాగ్దానాలు – ఓటర్లకే వెలుగు

తెలుగులో రాతలు – వ్యాపారస్తులకే వెలుగు

తెలుగులో ఇచ్చి పుచ్చుకోడాలు – ధనాగారాలకే వెలుగు

తెలుగు అమ్మల్ని చూస్తే – తెలుగమ్మే వెలుగు

తెలుగులో చదువులు – చదువులమ్మకే వెలుగు

తెలుగులో మాట్లాడితే – ఆ౦ధ్రదేశమే వెలుగు

తెలుగులో పాలన – దేశమ౦తా వెలుగు

తెలుగు దేశమ౦తా వెలిగితే – విశ్వమ౦తా తెలుగే వెలుగు!!

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!