-కౌసల్య కోపం కైకేయిమీద !

-కౌసల్య కోపం కైకేయిమీద !

-

రాముడు అడవికి వెళతానని తల్లికి చెప్పినప్పుడు 

మొదటిసారిగా కౌసల్య తన దుఃఖాన్ని బయట పెడుతుంది వాల్మీకంలో.

“నా భర్త రాజుగా ఉన్న ఇన్ని రోజులూ నేను ఎలాటి సుఖాలూ పొందలేదు. కనీసం నువ్వు రాజువయ్యాకైనా పొందుతాననుకున్నాను! నా సవతులనించి నేనెన్ని దుర్భాషలు విన్నాను పట్టమహిషినై కూడా! నా భర్త నాకు ఏ స్వాతంత్ర్యమూ ఇవ్వక చాలా తక్కువగా చూసేవాడు. కైకేయి దాసీజనం కన్నా హీనంగా నన్ను చూసేవాడు”. 

ఈ మాటలబట్టి కౌసల్యకి చాలా రోజులుగానే మనసులో ఆవేదన, కైకేయి అంటే ఈర్ష్యా ఉన్నాయనే అనిపిస్తుంది. ఈ మాటలనేటప్పటికి రాముడు కైకేయి వరాల వల్లే అడవికి వెళుతునాడన్న విషయం తెలుసని కూడా చెప్పలేం.


నిజమే! కౌసల్యతో రాముడు తాను దండకారణ్యానికి వెళ్ళుతున్నానని చెప్పినపుడు, కౌసల్య ఆడినదుర్భాషలు దశరథుడు తనని ఏ విధముగా చూచెడివాడో చెప్పినది. ఆమె కోపముగా చెప్పిన మాటలలో కైకేయిని దూషిస్తున్న అర్థం ఎక్కడ వున్నది?

తనని, దశరథుడు కైకేయియొక్క దాసజనముతో సమానముగా, అంతకంటె తక్కువగా చూచెడివాడని అన్నది. పోతే, కైకేయిపై ఈర్ష్య ఉండడం సహజమే! తాను పట్ట మహిషి. కైకేయి చిన్న భార్య. దశరథుడి ముద్దుల భార్య. బహుభార్యాసమాజంలో్సవతులపై ఇటువంటి ఈర్ష్యలు ఉండడం సహజమే కద!

తన గోడు చెప్పుకుంటూ,

సా బహూన్య మనోజ్ఞాని వాక్యాని హృదయఛ్చిదాం,

అహం శ్రోష్యే సపత్నీ నామవరాణాం వరా సతీ. అని వాపోయింది. ఇందులో అందరు సవతులూ తనని అనే ఎన్నో చెడ్డ మాటలు వినవలసి యున్నది, అన్న అర్థం ఉన్నదికదా! 

ఆవిడకి సవతులందరూ ఒకటే! కైకేయిపై ఆవిడకి పీకలవరకూ మంట అనే భావం నాకు పట్టలేదు.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!