భర్తృహరి సుభాషితం-

భర్తృహరి సుభాషితం-


-

నీరము తప్త లోహమున నిల్చి’ అని ఒక శ్లోకం ఉంది.

‘పడిన స్థానాన్ని బట్టి, నీటి బిందువు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’ అని 

దాని అర్థం.


వేడి ఇనుముపై పడితే క్షణంలో ఆవిరైపోతుoది. దగుల్బాజీలతో కలిస్తే విద్యార్ధి 

జీవితం ఆ విధంగా పనికిరాకుండా పోతుంది.


అదే నీటిబిందువు తామరాకుపై పడితే, మోటార్ బైకుల మీదా, బీరుటిన్నులమీదా కొన్నాళ్లపాటుమెరిసి సాయంత్రానికి ఆవిరైపోతుంది. అలాంటి విద్యార్ధులు కాలేజీలో

హీరో, హీరోయిన్లలా చలామణీ అయి, బయటకు రాగానే కాలగర్భంలో కలిసిపోతారు. 

అదే బిందువు ముత్యపు చిప్పలో పడినట్లయితే ముత్యంలా మారుతుంది.

తాను ఎక్కడ పడాలో నీటి బిందువు చేతిలో లేదు. దాన్ని విధి నిర్ణయిస్తుంది.

కానీ ఆ శక్తి, యుక్తి మనకి ఉంది.


ఒక తల్లి కొడుకుని ఒక స్వామి దగ్గరకు తీసుకువెళ్ళింది. 

స్వామి చదువుకున్నవాడు. ఙ్ఞాని. "స్వామీ! నా కొడుకు తెలివైన వాడే కానీ మాట వినడు. చదువు తప్ప అన్ని విషయాల్లోనూ ఆసక్తి వున్నది. వాడికేదైనా చెప్పి మార్చండి" అన్నది.


"ఏం చెప్పను? దేని గురించిచెప్పను?" అని స్వామి చిరునవ్వుతో అడిగాడు.


అక్కడ ఒక తారు రోడ్డు కొత్తగా వేస్తున్నారు.


కొంటె కుర్రవాడు అటు చూపిస్తూ "దాని గురించి చెప్పండి" అన్నాడు. 

పక్కనే పడివున్న ఒక తారుముద్దని తీసుకు రమ్మని "ఈ తారు ఉండ ఖరీదు

ఎంత వుంటుందో ఉజ్జాయింపుగా చెప్పగలవా?" అని అడిగాడు స్వామి.


"అయిదు నుంచి పది రూపాయలు".


"కానీ ఇందులోని పెట్రోలియంని సింధెటిక్ వైరుగా మారుస్తే, అది గుండె ఆపరేషన్‌లో పదివేలు ఖరీదు చేసే దారంగా పనిచేస్తుంది. ఈ ముద్దలోంచి వెయ్యి వైర్లు తయారు చేయవచ్చు. మరోలా చెప్పాలంటే ఈ పది రూపాయల తారుని మరొక రకంగా

ప్రోసెస్ చేస్తే, దాని విలువ కోటి రూపాయలు అయివుండేది.” 

వింటూన్న కుర్రవాడు నిశ్చేష్టుడయ్యాడు.


అతడి కళ్ళలోని కుతూహలం గమనించి స్వామి కొనసాగించాడు. 

"వర్తమానాన్ని ఎలా ప్రోసెస్ చేసుకుంటే నీ భవిష్యత్తు అలామారుతుంది. 

నీవిప్పుడు ఇంటర్మీడియెట్ స్టేజిలోవున్నావు. 

ఇంటర్ అంటే ‘మధ్యలో’ అని అర్ధం. అదొక రైల్వే జంక్షన్.

రకరకాల రైళ్ళు అక్కడికి వస్తూ వుంటాయి. ఒక రైలు నిన్ను కాశ్మీరుకి, 

మరొకటి జైసల్మీర్ ఎడారికీ తీసుకెళ్తుంది. పూలవనానికి వెళ్తావా, 

ఇసుక ఎడారికి వెళ్తావా అన్నది నీవే నిర్ణయించుకోవాలి. 

ఒక సారి రైలు ఎక్కిన తరువాత మారటం కష్టం.

లక్షరూపాయల ఉద్యోగంతో ప్రారంభిస్తే కోటికి చేరుకోవటం సులభం. 

పదివేలతో మొదలు పెడితే లక్షకు చేరుకోవటం కష్టం." వింటున్న

కుర్రవాడు అర్థమైనట్టుగా వినమ్రతతో నమస్కరించాడు.


మీకు కనపడిన ప్రతి విద్యార్థికీ పై కథ చెప్పండి.

-

(ఏను గు లక్ష్మణకవి వారి తెలుగు సేత)


"నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా

నీరమే ముత్యమట్లు నలినీదళ సంస్థితమై దనర్చు నా

నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచితప్రభన్

పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్!

-

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!