పేగుతీపి !

పేగుతీపి !

-

తల్లీ కొడుకూ అడవి మార్గాన వెడుతుంటే ఓ నది అడ్డం వచ్చింది. తల్లి ముందుగా ప్రవాహంలోకి దిగి కొడుకును తన చేయి పట్టుకోమంది.

‘అలా కాదు నువ్వే నా చేయి పట్టుకో’ అన్నాడు కొడుకు.

‘తేడా ఏముంది’ అడిగింది తల్లి.

‘పెద్ద అల వస్తే నేను నీ చేయి వొదిలేసి నా దారి చూసుకుంటాను.

అదే నువ్వు పట్టుకుంటే నాకు ఎంతో భరోసా. ఏం జరిగినా నా చెయ్యి వొదిలి పెట్టవు. నువ్వు మునిగయినా సరే నన్ను బయట పడేస్తావు. అదే తేడా’ అన్నాడు కొడుకు.

-

(రాజా రవి వర్మ చిత్రం.)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!